Movies

దేవుళ్ళు సినిమాలో నటించిన నిత్యా ఇప్పుడు ఎక్కడ ఎలా ఏమి చేస్తుందో తెలుసా?

దేవుళ్ళు సినిమా తెలుసుకదా. క్రియేటివ్ డైరెక్టర్ కోడి రామకృష్ణ డైరెక్షన్ లో వచ్చిన పృథ్వి రాజ్, రాశి జంటగా వచ్చిన ఈ మూవీలో ఇద్దరు చిన్నపిల్లలు యాక్షన్ తో అదరగొట్టేసారు కదా. అందులో ఒకరు మాస్టర్ నందన్ , బేబీ నిత్య ప్రధాన పాత్రలు పోషించి తమ నటనతో ప్రేక్షకులను కట్టిపడేసారు. వందేమాతరం సంగీతం అందించిన ఈ మూవీ అప్పట్లో సంచలన విజయంతో విశేషంగా ఆకట్టుకుంది. పండగల్లో , పబ్బాల్లో ఇప్పటికీ ఈ మూవీలోని జనరంజక పాటలు వినిపిస్తుంటాయి. ఇక ఈ చిత్రంలో నటించిన బేబీ నిత్య ఎంతో సహజంగా నటించి ఆడియన్స్ తో కంటతడి పెట్టించింది. అప్పట్లో ఎవరీ అమ్మాయి అంటూ ఇండస్ట్రీ వర్గాలు ఆశ్చర్యంలో మునిగిపోయాయి.

అమ్మానాన్నలను కలిపే పాత్రలో నిత్యా చేసిన నటన ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది. ఇప్పటికీ చాలామంది తలచుకుంటారు కూడా. వయసులో చిన్నదైనా సరే, ఎంతో అనుభవం గల నటిగా నటించి, దిగ్గజ దర్శకుడు కోడి రామకృష్ణతో శభాష్ అనిపించుకుంది. ఇక నిత్యా నటనకు అడ్డం పట్టేవిధంగా ;లిటిల్ హార్ట్స్,చిన్ని చిన్ని ఆశ మూవీలకు నంది అవార్డులు వరించాయి. బాలనటిగా దాదాపు 20చిత్రాల్లో నటించి, మెప్పించింది.

అయితే ఓ దశకు వచ్చాక ఆమె సినిమాల నుంచి తాత్కాలిక విరామం ప్రకటిచింది. హైద్రాబాద్ లోనే పుట్టి పెరిగిన ఈమె పూర్తిపేరు నిత్యా శెట్టి. ఇంటర్ లో డిస్టిక్షన్ లో పాసైన ఈమె ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ లో ఇంజనీరింగ్ పూర్తిచేసింది. ఇన్ఫోసిస్ వంటి ప్రముఖ సంస్థలో ఉద్యోగంలో చేరిన ఈమె కు సినిమాల్లో ఉండే కోరిక ఉద్యోగాన్ని వదిలేసేలా చేసింది.

ఆ విధంగా జాబ్ వదిలిపెట్టేసిన దాగుడు మూతల దండాకోర్ , పడేసావే చిత్రాల్లో నటించి ,మరిన్ని ఛాన్స్ ల కోసం ఎదురుచూస్తోంది. అంతేకాదు ఎవరాట్టం అనే తమిళ మూవీతో కోలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన నిత్యా ను కాదల్ కాలం చిత్రం వెతుక్కుంటూ వచ్చింది. కలర్స్ స్వాతి కి ట్విన్ సిస్టర్ లా వుండే నిత్యాను తమిళ ప్రేక్షకులు బానే ఇష్టపడుతున్నారట. యూత్ ఫుల్ చిత్రాల్లో నటించాలని ఉవ్విళ్లూరుతున్న ఈమె మరింత క్యూట్ గా తయారవుతోంది.