Movies

జబర్దస్త్ షో మానేసిన చంటి ఇపుడు ఏమి చేస్తున్నాడో తెలుసా?

జబర్దస్త్ కామెడీ షోతో చలాకి చంటిగా తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ అయిన ఈ కమెడియన్ పిచ్చ క్రేజ్ తెచ్చుకున్నాడు. ఈటివి 2లో ప్రసారం అయిన నా షో నా ఇష్టం షోతో బాగా పాపులర్ అయ్యాడు. ఇక జబర్దస్త్ మానేసాక టివి షోలు, సొంతంగా స్టేజి షోలు చేస్తూ బానే సంపాదిస్తున్నాడు. ఇక చంటి ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు,ఎలా ఎదిగాడో ఓసారి పరిశీలిస్తే,తూర్పు గోదావరి జిల్లాలో ఓ పల్లెటూరికి చెందిన ఇతని అసలు పేరు వినయ మోహన్. వ్యవసాయం చేస్తూ, జీవనం సాగిస్తున్న ఇతని తల్లిదండ్రులు సాగు కష్టంగా మారడంతో ఉపాధికోసం చంటితో కల్సి హైదరాబాద్ వచ్చారు.
డిగ్రీ పూర్తయ్యాక చంటి ఉద్యోగ వేట స్టార్ట్ చేసాడు.

మొదట్లో టాటా ఇండికాం లో ఎగ్జుక్యూటివ్ జాబ్ తో ఉపాధి రంగంలో అడుగుపెట్టిన చంటి,ఆ తర్వాత జీతం సరిపోకపోవడంతో తనకున్న మంచి పేరుతో రేడియో మిర్చిలో RJ గా చేరాడు. అప్పుడే అతని పేరు చలాకి చంటిగా మార్చుకుని, శ్రోతలను అలరించాడు. ఆతర్వాత తనకున్న అదనపు కళతో ట్యాంక్ బండ్ టూరిజం బోట్స్ లో పార్ట్ టైం గా మిమిక్రి చేస్తూ డబ్బులు సంపాదించాడు. ఇలా కష్ఠాలు పడుతూ సినిమాల్లో అవకాశం కోసం ట్రై చేసాడు.

ఇక RJ గా చేసేటప్పుడే చంటి బంటీ ప్రోగ్రాం బాగా చేసిన చలాకి చంటి ఆ ప్రోగ్రాం హిట్ తో జల్లు మూవీలో ఛాన్స్ వచ్చింది. కానీ ఆ మూవీ అట్టర్ ప్లాప్ కావడంతో మళ్ళీ కష్ఠాలు మొదలయ్యాయి. ఇక అందరి దర్సకులు,నిర్మాతల దగ్గరకు ఫిలిం నగర్ ల కాళ్ళు అరిగేలా తిరిగిన చంటి కి, భీమిలి కబడ్డీ జట్టులో అవకాశం రావడం, అది బ్రేక్ ఇవ్వడం జరిగినా, మళ్ళీ అవకాశాలు రాకపోవడంతో యూట్యూబ్ కామెడీ స్కిట్లు చేసాడు. ఆసమయంలో వదల బొమ్మాలి అంటూ అరుంధతి స్కిట్ కామెడీ పండింది.

దీంతో చంటిని మల్లెమాల అధినేత శ్యాం ప్రసాద్ రెడ్డి పిలిచి జబర్దస్త్ షోలో ఛాన్స్ ఇచ్చారు. ఆ విధంగా నవ్వుల ప్రస్థానం సాగించిన చంటి , ఆ తర్వాత జబర్దస్త్ మానేసాక పలు సినిమాల్లో బిజీ అయ్యాడు. ఇక ఆ మధ్య తూర్పు గోదావరి జిల్లాకు చెందిన తన మరదలిని పెళ్లి చేసుకున్న చంటి,ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటూ, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో స్టేజ్ షోలు చేస్తూ, రాణిస్తున్నాడు.