జయసుధ ఎంత ఆస్థి సంపాదించిందో తెలుసా…ఇప్పుడు ఏమి చేస్తుంది ..నమ్మలేని నిజాలు
తెలుగులో కొందరు హీరోయిన్స్ పేరుచెప్పగానే ఆవిడ తెలియక పోవడం ఏమిటనే మాటలు వింటుంటాం. అలా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయక్కర్లేని పేర్లలో సహజ నటి జయసుధ ఒకరు. హీరోయిన్ గా, క్యారక్టర్ ఆర్టిస్టుగా తెలుగువారి హృదయాల్లో చెరగని ముద్రవేసుకున్న నటి జయసుధ. విశేష పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న ఆమె జ్యోతి చిత్రంతో సినిమా పరిశ్రమలో తానేంటో నిరూపించుకుంది. ఆ తర్వాత మరపురాని పాత్రలు పోషించి కొద్దీ కాలంలోనే అగ్రశ్రేణి కథానాయికగా ఎదిగింది. ఇక ఆరోజుల్లో శ్రీదేవి, జయప్రద, జయసుధ ల మధ్యే పోటీ ఉండేది.నిజానికి అందంలో జయప్రద, శ్రీదేవి తనకన్నా మెరుగ్గా ఉన్నప్పటికీ అభినయంతో మేటి నటిగా నిల్చింది జయసుధ. 1959 డిసెంబర్ 17న జన్మించింది.
ఆమె అసలు పేరు సుజాత. ఇక గిన్నీస్ బుక్ లో చోటు సంపాదించుకున్న నటి ,దర్శకురాలు విజయనిర్మల, జయసుధకు స్వయానా మేనత్త. ఆ విధంగా సినిమాల్లోకి రావడం సులభంగా జరిగినా, ఇండస్ట్రీలో పోటీని తట్టుకుని,కృషితో సగర్వంగా నిలబడింది. మొదటి చిత్రం పండంటి కాపురం. మొదట్లో కొన్ని నెగెటివ్ రోల్స్ చేసినప్పటికీ జ్యోతి మూవీతో లేడీ ఓరియంటెండ్ కథలకు కేరాఫ్ అడ్రెస్ అయ్యారు.
ఆమె కథ,గృహప్రవేశం,ఇది కథ కాదు వంటి చిత్రాలు జయసుధలోని నటనకు కొత్త భాష్యం చెప్పాయి. ఆ తర్వాత ప్రేమాభిషేకం, యుగంధర్, నాదేశం వంటి సినిమాలు గ్లామర్ గానూ తానేమిటో ప్రూవ్ చేసుకుంది. ఎన్నో క్యారెక్టర్ పాత్రలు పోషిస్తున్న జయసుధ రీసెంట్ గా శతమానం భవతి చిత్రంలో అలవోకగా నటించి మెప్పించింది. దాదాపు నాలుగున్నర దశాబ్దాలుగా ఇండస్ట్రీలో గల జయసుధ ఎంతో జాగ్రత్త పరురాలని పేరు తెచ్చుకున్నారు.
అప్పటిలో తమ సంపాదనను దానధర్మాలకు వెచ్చించి చివరిలో దయనీయస్థితి ఎదుర్కొన్నవాళ్ళు చాలామంది వున్నారు. ఇక కుటుంబ సభ్యుల మోసాలకు గురైన హీరోయిన్ల ఉదంతాలు కూడా ఎన్నో ఉన్నాయి. అయితే జయసుధ కథ మరోలా వుంది. ఒకప్పుడు ఇండస్ట్రీలో కళ్ళు చెదిరే పారితోషికం అందుకున్న ఆమె తన భర్త ఫామ్ లో ఉన్నప్పుడు సొంత ప్రొడక్షన్ లో పెట్టుబడులు పెట్టి, లాభాలు కళ్లజూసింది. కొన్నాళ్ల క్రితం మరణించిన నితిన్ కపూర్ బాలీవుడ్ లో పలు చిత్రాలకు దర్శకత్వం వహించడంతో పాటు టెలివిజన్ సీరియల్ కి డైరెక్ట్ చేసారు.
అయితే భర్త మరణంతో జయసుధ జీవితాన్ని కుదిపేసింది. భర్త పోయిన జయసుధ వైరాగ్యానికి లోనైన జయసుధ చాలా డబ్బు అనాధ శరణాలయాలకు, సామాజిక సంస్థలకు విరాళంగా ఇచ్చేసిందట. క్రిస్టియానిటీ పుచ్చుకున్న ఈమె చాలా చర్చిలకు ఆర్ధిక సాయం చేసినల్టు తెలుస్తోంది. ఇక రాజకీయాల్లోకి రావడం వలన ఆర్ధికంగా చాలా నష్టపోయిందని సన్నిహితులు చెప్పేమాట.