Movies

బిందు మాధవి గుర్తుందా?ఆమె ఇప్పుడు ఏ స్టార్ హీరోయిన్ బాయ్ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకుంటుందో తెలుసా?

హోమ్లీ బ్యూటీ అనగానే కొందరు స్టార్స్ గుర్తుకొస్తారు. అందులో ఆవకాయ్ బిర్యానీ మూవీలో వేసిన బిందు మాధవి గుర్తుండి పోతుంది. ఇబ్బడి ముబ్బడిగా దిగుమతి అవుతున్న బాలీవుడ్ భామలతో పోలిస్తే,కాస్త అందం తక్కువైనా, నటనలో మాత్రం ఎవ్వరికీ తీసిపోని అచ్చ తెలుగు అమ్మాయి బిందు మాధవి. మోడలింగ్ రంగం నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన ఈ అమ్మడు తెలుగులో మొదటి మూవీ చేసి, ఆ తర్వాత తమిళ చిత్ర పరిశ్రమలో సెటిల్ అయింది. చిత్తూరు జిల్లా మదనపల్లి లో 1986జూన్ 14న బిందు మాదవి జన్మించింది. ఇక ఆమె తండ్రి వాణిజ్య పన్నుల శాఖ డిప్యూటీ కమీషనర్ కావడంతో రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో తిరిగినప్పటికీ, ఫైనల్ గా చెన్నైలో సెటిల్ అవ్వడంతో స్టడీ అంతా అక్కడే నడిచింది.

2005 లో వెల్లూర్ యూనివర్సిటీ నుంచి బయటెక్నాలజీ ఇంజనీరింగ్ చేసిన బిందు మాధవి,అదే రంగంలో మాస్టర్ డిగ్రీ చేసి, జాబ్ చూసుకోవాలని అనుకుంది.ఇక కాలేజీ డేస్ లో శరవణ స్టోర్స్ కి కొన్ని మోడలింగ్స్ చేయడంతో సినిమా ఛాన్సులు వచ్చాయి. ఈ విషయం ఇంట్లో చెప్పడంతో ఆమె తండ్రి ఆరు నెలలు అసలు మాట్లాడలేదట. మొత్తానికి ఈమె తెరంగేట్రం చేయడం, తెలుగులో పిల్ల జమిందార్, రామ రామ కృష్ణ కృష్ణ మూవీస్ నటించడం జరిగిపోయాయి.

అయితే ఇంట్లో వాతావరణం కారణమో, లేక ఈమెకే ఇష్టం లేదో మొత్తానికి ఎక్స్ పోజింగ్ కి దూరం అనడంతో తెలుగులో ఛాన్స్ లు మిస్సయ్యాయి. దీంతో ఈమె తమిళ చిత్రసీమలో అడుగుపెట్టి,తన అదృష్టాన్ని పరీక్షించు కోవడంతో అనతి కాలంలోనే చిన్న సినిమాల స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఇక బిందు మాధవిపై గత కొంతకాలంగా ఎన్నో ఊహాగానాలు, రూమర్స్ వస్తున్నాయి. దీనికి కారణం నిర్మాత, బిజినెస్ మ్యాన్ వరుణ్ మణియన్ తో జాలి ట్రిప్ కి వెళ్లి రావడం,దీనికి సంబంధించిన ఫోటోలు వెలుగు చూడడంతో ఈ అమ్మడి యవ్వారం బయటపడింది.

తాజ్ మహల్ దగ్గర వీరిద్దరూ హల్ చల్ చేసారు. అయితే ఈ వరుణ్ మణియన్ ఎవరంటే గతంలో నటి త్రిషతో పీకల్లోతు ప్రేమలో మునిగి, నిశ్చితార్ధం కూడా అయింది. అయితే కొన్ని రోజుల్లో పెళ్లి జరగాల్సిన సమయంలో నిశ్చితార్ధం కేన్సిల్ అయింది. పెళ్లయ్యాక సినిమాల్లో యాక్షన్ వద్దని చెప్పడంతో పెళ్లి కి త్రిష నో చెప్పడమే దీనికి కారణం.

ఇక అతనితో బిందు తరచూ కనిపిస్తూ, జాలీ ట్రిప్ లకు వెళ్లడం వంటి పరిణామాల్లో ఇద్దరూ ప్రేమలో మునిగారని కోలీవుడ్ వర్గాలు కోడై కూస్తున్నాయి. ఇక సినీ అవకాశాలు కూడా తగ్గడంతో పెళ్లి చేసుకుని, కోలీవుడ్ కి గుడ్ బై చెప్పాలని బిందు భావిస్తున్నట్లు తెలుస్తోంది.