Movies

అనుష్క తల్లికి థాంక్స్ చెప్పిన ప్రభాస్ కారణం ఏమిటో తెలుసా?

సినీ ఇండస్ట్రీలో కొందరి మధ్య బంధం గురించి రకరకాల ఊహాగానాలు వస్తాయి. ఇక టాలీవుడ్ టాప్ హీరో ప్రభాస్, అందాల తార అనుష్క ల ప్రస్తావన వస్తే, వాళ్ళ మధ్య అనుబంధం తప్పనిసరిగా చెప్పకుండా ఉండలేరు. ఎందుకంటే ఎన్నో ఏళ్ళ నుంచి టాలీవుడ్ లో కొనసాగుతున్న వీరిద్దరి నడుమ ఎఫైర్ ఉందని విపరీతంగా ప్రచారం నడుస్తోంది. తాము బెస్ట్ ఫ్రెండ్స్ మాత్రమేనని ఇప్పటికే స్పష్టం చేసినా సరే, వచ్చే కథనాలకు అడ్డూ అదుపులేదు. బాహుబలి బిగినింగ్,కంక్లూజన్ షూటింగ్ ల కోసం దాదాపు నాలుగైదు సంవత్సరాలు ఇద్దరూ కలిసే ఉండడంతో వీరి మధ్య కెమిస్ట్రీ ఉందని, బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకూ వీరలెవెల్లో మోతమోగింది.ఇటీవల అయితే వీళ్ళిద్దరూ పెళ్ళికి రెడీ అవుతున్నారని,ప్రభాస్ పెదనాన్న పెళ్లి ఏర్పాట్లలో నిమగ్నం అయ్యారని కూడా కథనాలు విన్పించాయి.

అలాగే వీళ్ళిద్దరూ బర్త్ డే ల సందర్బంగా ఖరీదైన గిఫ్ట్ లు ఇచ్చిపుచ్చుకుంటున్నారన్న కధనాలు సరేసరి. అయితే అనుష్క తల్లి వీటన్నింటికీ తెరదించుతూ అభిప్రాయాలూ వెల్లడించారు. ప్రభాస్ లాంటి వ్యక్తి అల్లుడైతే ఎవరికైనా అంతకన్నా ఏమి కావాలని పేర్కొంది. అనుష్కకు ప్రభాస్ లాంటి మిస్టర్ ఫర్ ఫెక్ట్ జోడీగా వస్తే, అంతకన్నా అదృష్టం ఏముంటుందని అనుష్క మథర్ చెప్పుకొచ్చారు.

అయితే వాళ్ళిద్దరి మధ్యా స్నేహ బంధం మాత్రమే ఉందని ఆమె స్పష్టంచేశారు. ఈ వ్యాఖ్యలపై ప్రభాస్ స్పందిస్తూ, ఆమె చెప్పిన దాంట్లో వాస్తవం ఉందని అన్నాడట. తనని మిస్టర్ ఫర్ ఫెక్ట్ అని, కాంప్లిమెంట్ ఇచ్చినందుకు అనుష్క తల్లికి ప్రభాస్ కృతజ్ఞతలు చెప్పాడు. తమ మధ్య కేవలం ఫ్రెండ్స్ షిప్ మాత్రమేనని వెల్లడించాడట.

తానూ ఎన్నో ఏళ్లుగా నెత్తినోరు మొత్తుకుంటున్నా సరే, తమ మధ్య ఎఫైర్ ఉందని పుకార్లు వైరల్ చేసారని, అయితే ఇప్పుడు అనుష్క తల్లి చెప్పినందున ఇప్పుడైనా అర్ధం చేసుకోవాలని ప్రభాస్ వ్యాఖ్యానించాడు. ఎప్పుడూ వన్ సైడ్ గా అభిప్రాయాలు ఉండకూడదని, ఇతరుల అభిప్రాయాలూ తీసుకోవాలని ఈ బాహుబలి హీరో అన్నాడట.

ఇక అవతలి వ్యక్తి స్త్రీ అయినపుడు మనం మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుందని అంటున్నాడు. ప్రభాస్ లాంటి మిస్టర్ ఫర్ ఫెక్ట్ జోడీగా వస్తే, అంతకన్నా అదృష్టం ఏముంటుందని అనుష్క మథర్ వ్యాఖ్యానించడం, అనుష్క కుటుంబ సభ్యుల సంస్కారానికి నిదర్శనమని ప్రభాస్ పేర్కొంటూ, ఇంతకన్నా దీనిపై తానేమీ వ్యాఖ్యానించబోనని తన సన్నిహితుల దగ్గర అన్నాడట.