Movies

తన భార్య రమ గురించి షాకింగ్ విషయాలను చెప్పిన రాజమౌళి

తెలుగు చిత్ర రంగంలో ప్రణాళికా బద్ధంగా సినిమా తీసి హిట్ కొట్టడంలో తిరుగులేని టాప్ మోస్ట్ స్టార్ డైరెక్టర్ అనగానే ఎస్ ఎస్ రాజమౌళి పేరునే చెబుతారు. ఏ సినిమా తీసినా మొత్తం కుటుంబం ఇన్వాల్వ్ మెంట్ పూర్తిగా ఉంటుంది. ఇక రాజమౌళి విజయాల్లో అతని వైఫ్ రమది కీ రోల్ అనేది అందరికీ తెల్సిందే. మగధీర, బాహుబలి వంటి భారీ బడ్జెట్ చిత్రాల్లో ఆమె కాస్ట్యూమ్స్ డిజైనర్ గా పనిచేసి,అందరినీ మెప్పించారు. నిజానికి రాజమౌళి – రమ వివాహం చాలా ఆసక్తికరంగా సాగిందట. అవును విడాకులు తీసుకుని, ఓ బాబు కూడా ఉన్న రమని రాజమౌళి పెళ్లిచేసుకున్నాడు. ఈ విషయాన్ని పలు ఇంటర్యూలో చెప్పినట్లు వీడియోలు,ఆడియోలు చక్కర్లు కొడుతున్నాయి.

వాస్తవానికి రాజమౌళి కన్నా రమా రాజమౌళి నాలుగేళ్లు పెద్దదట. తన విజయం ఆమె వల్లే సాధ్యమని, నా విజయం వెనుక ఆమె ఉందని రాజమౌళి తరచూ చెబుతారు. ఇక తాజాగా ఓ అవార్డు ఫంక్షన్ కి హాజరై, ఆ ఫంక్షన్ లో భార్యతో సహా అవార్డు తీసుకున్నాడు రాజమౌళి. గోల్డ్ మెడల్ ఆఫ్ విజనరీ ఆఫ్ ఇండియన్ సినిమా అవార్డుని రాజమౌళి అందుకున్నాడు. ఈ సందర్బంగా ప్రఖ్యాత దర్శకుడు ఎస్పీ సుబ్బరామన్ చేతుల మీదుగా సత్కరించారు.

బాహుబలి మూవీతో ఇండియన్ సినిమా ప్రతిష్టను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారని, అలాంటి వ్యక్తిని సత్కరించడం ఆనందంగా ఉందని ఆయన పేర్కొన్నారు.తమిళ సినీ ప్రముఖులతో పాటు,అనుష్క, రమ్యకృష్ణ నాజర్ లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ఫంక్షన్ కి సతీసమేతంగా రావాలని ఆహ్వానించారు.

ఇక రాజమౌళి తన భార్యను ఉద్దేశించి చిన్ని వేదికపైకి రారా అంటూ రమను ముద్దు పేరుతో పిలవడంతో వేదిక మొత్తం మారుమోగిపోయింది.అవార్డు తీసుకుంటుండగా సభలో వారంతా లేచి నిలబడి కరతాళ ధ్వనులు చేశారు. అవార్డు అందుకున్నాక రాజమౌళి దంపతులు ర్యాంప్ పై నడిచి, అలరించడంతో అందరూ కేకలు, ఈలలతో హోరెత్తించారు.

అనంతరం రాజమౌళి ఎమోషనల్ స్పీచ్ ఇస్తూ, దర్శకుడు కాక ముందు ఇదే ఏవిఎం స్టూడియో ముందు తనకు అవమానం జరిగిందని,గేటు కీపర్ ఆపేసాడని,అలాంటి చోటనే ఇప్పుడు ఏవిఎం అధినేత పేరిట అవార్డు తీసుకోవడం గర్వంగా ఉందని చెప్పుకొచ్చాడు. ఇలా ప్రతి అవార్డు ఫంక్షన్ కి తన భార్యను రమను తీసుకెళ్తూ, రాజమౌళి తన గొప్పతనాన్ని చాటుకున్నాడు.