Movies

కొడుకు పుట్టినరోజు సందర్భంగా ఎవరు ఊహించని నిర్ణయాన్ని తీసుకున్న ఎన్టీఆర్

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ పెద్ద కొడుకు అభయ్ రామ్ పుట్టినరోజు ఈ రోజు. అభయ్ రామ్ ఎన్టీఆర్,లక్ష్మి ప్రణతి దంపతులకు 2014 జులై 22 న జన్మించాడు. గత సంవత్సరం ఎన్టీఆర్ బిగ్ బాస్ మొదటి సీజన్ కి హోస్ట్ గా చేస్తున్నప్పుడు అభయ్ రామ్ పుట్టినరోజు వేడుకలను బిగ్ బాస్ సెట్ మీదే జరుపుకున్నారు. బుడి బుడి అడుగులతో ముద్దు ముద్దు మాటలతో అభయ రామ్ అందరిని ఆకట్టుకున్నాడు. ఎన్టీఆర్ ఈ సంవత్సరం సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న అరవింద సమేత వీర రాఘవ సినిమా షూటింగ్ కి కాస్త బ్రేక్ ఇచ్చి కొడుకు పుట్టినరోజుకు ఇంటిలోనే ఉన్నాడు ఎన్టీఆర్. ఎన్టీఆర్ పుట్టినరోజు పార్టీని ఇంటిలోనే ఏర్పాటు చేసి బందుమిత్రులను పిలిచి గ్రాండ్ గా సెలబ్రేట్ చేసాడు.

ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఎన్టీఆర్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాలో కొడుకు అభయ్ రామ్ ని నటింపచేయాలని భావించి…ఈ విషయాన్నీ త్రివిక్రమ్ కి చెప్పగా ఒకే చెప్పాడట. అభయ్ రామ్ పుట్టినరోజు సందర్భంగా ఎన్నో సేవా కార్యక్రమాలను చేపట్టాడు.