Movies

కృష్ణ భగవాన్ జీవితం గురించి బయట పడ్డ నమ్మలేని నిజాలు

సినీ దర్శకుడు వంశీ డైరెక్షన్ లో తెరకెక్కిన మహర్షి మూవీతో తెలుగు వెండి తెరకు పరిచయమైన కృష్ణ భగవాన్ అనగానే మనం చూడగానే నవ్వు పుట్టించే కమెడియన్లలో ఒకడని చెప్పవచ్చు. తన కామెడీతో తెలుగు ప్రేక్షకులను హాస్యంలో ముంచెత్తుతూ,పంచ్ డైలాగులతో కడుపుబ్బా నవ్వించే కృష్ణ భగవాన్ ఇప్పటిదాకా 100 కు పైనే చిత్రాల్లో నటించాడు. సినిమా ప్లాప్ కావచ్చు కానీ, కృష్ణ భగవాన్ ప్లాప్ కాలేదనేంతగా ఎదిగాడు. తూర్పుగోదావరి జిల్లా కైకవోలు గ్రామానికి చెందిన ఇతడి తల్లిదండ్రులు మీనవల్లి వీర్రాజు,లక్ష్మీకాంతం. 1965 జులై 2న జన్మించిన కృష్ణ భగవాన్ అసలు పేరు పాపారావు చౌదరి. కైకవోలులో బాల్యం గడిచింది. హైస్కూల్ చదువు పెదపూడిలో పూర్తి చేశారు.
Comedian Krishna Bhagavaan
కాకినాడ ఆండాళ్ళమ్మ కాలేజీలో ఇంటర్ పూర్తిచేసి, హైదరాబాద్ లో డిగ్రీ చేసాడు. అప్పటికే నాటకాల పిచ్చితో చదువుపై అంతగా శ్రద్ధ పెట్టకపోవడంతో డిగ్రీలో మార్కులు తగ్గి, పీజీలో సీటు రాకపోవడంతో సినిమాల్లో ఛాన్స్ లకోసం మద్రాస్ వెళ్ళిపోయాడు. రవితేజాతో కల్సి ప్రఖ్యాత డాన్సర్ అనురాధ ఇంట్లో అద్దెకుంటూ సినిమాల్లో వేషాలకోసం ప్రయత్నించేవారు.

ఇక దగ్గరలోనే వంశీ ఆఫీసు ఉండడంతో రోజూ ఒకరికొకరు చూసుకోవడం వలన పరిచయం ఏర్పడడంతో మహర్షి మూవీలో ఛాన్స్ దక్కింది. ఇక ఆ సినిమాలో ఎక్కువ టేక్ లు తీసుకోవడంతో ప్రొడక్షన్ వాళ్ళు ‘ఇలాగైతే ఎలాగయ్యా ‘అంటూ ముఖం మీదే అడిగేశారట. వంశీ జోక్యం చేసుకుని,కృష్ణ భగవాన్ మంచి స్టేజ్ ఆర్టిస్ట్ అని చెబితే, అలాగని ప్రతి టేక్ కి స్టేజ్ వేయలేం కదా అంటూ ప్రొడక్షన్ వాళ్ళు వ్యాఖ్యానించారట.

మొత్తమ్మీద మహర్షి చిత్రం పూర్తవ్వడం, అందులో కృష్ణ భగవాన్ కి పేరు రావడంతో కెరీర్ స్పీడందుకుంది. ఏప్రియల్ 1మూవీలో విలన్ గా అదరగొట్టిన యితడు, మొదట్లో విలన్ పాత్రల్లో రాణించినా, ఆ తర్వాత కమెడియన్ అయ్యాడు. జైత్ర యాత్ర మూవీ తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న యితడు ఆ తర్వాత ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు మూవీతో రీ ఎంట్రీ ఇచ్చాడు.

అది కూడా వంశీ చిత్రం కావడం యాదృచ్ఛికమే. కమెడియన్ గా ఆ మూవీతో కొత్త అవతారం ఎత్తి, అదే బాణిలో కొనసాగుతున్నాడు. వంశీ చిత్రాల్లో తప్పనిసరిగా కనిపించే కృష్ణ భగవాన్ తన బంధువుల అమ్మాయి లక్ష్మిని పెళ్లి చేసుకున్నాడు. వీరికో ఓ కుమార్తె వుంది. మద్యం వ్యసనం ఫుల్లుగా ఉండే యితడు ఓసారి తప్ప తాగి పడిపోవడమే కాదు,ఓసారి,ఓ కాలేజీ ఫంక్షన్ వెళ్తూ ఫుల్లుగా మద్యం సేవించి వెళ్ళాడట.

అక్కడ గరికపాటి నరసింహారావు ని ఇష్టం వచ్చినట్లు దూషించడంతో కార్యక్రమం రసాభాస అయిందట. అయితే ఈ మధ్య కాలంలో మద్యానికి దూరంగా ఉంటూ సినిమాలపై ఫోకస్ పెట్టాడట. పెద్ద హీరోల సినిమాల్లో అడపాదడపా కనిపించే యితడు , మీడియం రేంజ్ సినిమాల్లో మాత్రం తప్పకుండా ఉంటాడు.