కృష్ణ,విజయనిర్మల గురించి ఇంత కాలానికి బయట పడిన నిజం
టాలీవుడ్ లో సూపర్ స్టార్ కృష్ణ గురించి తెలియని వారు ఎవరు లేరు. అంతేకాక తెలుగు చిత్ర పరిశ్రమలో అయన చేసిన ప్రయోగాలు ఎవరు చేయలేదు. కొత్త ట్రెండ్ సృష్టించటంలో కృష్ణ తర్వాతే ఎవరైనా. 35MM కి పరిమితమైన 70MM కి మార్చిన ఘనత కృష్ణదే. అయన వ్యక్తిగత జీవితం కూడా చాలా విలక్షణం. కృష్ణకు పెళ్లయిన సరే ఒంటరి జీవితం గడుపుతున్న విజయనిర్మలకు జీవితాన్ని ఇచ్చారు. వీరి వివాహ బంధానికి 5 దశాబ్దాలు. వీరి మధ్య పొరపొచ్చాలు వచ్చాయనే విషయం ఎవరు వినలేదు. అంత అన్యోన్యంగా దాంపత్యాన్ని కొనసాగిస్తున్నారు. సూపర్ స్టార్ కృష్ణ సహనటి విజయనిర్మల ప్రేమలో పడటం కూడా చాలా ఆసక్తికరంగా సాగింది. అప్పట్లో సాక్షి సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది.
ఈ సినిమాకి సంబందించిన ఒక దృశ్యాన్ని మీసాల కృష్ణుడు దేవాలయంలో చిత్రీకరణ జరిపారట. అయితే ఆ గుడిలోకి వెళ్లిన ఏ జంటకు అయినా పెళ్లి అయ్యిపోతుంది. అలాంటి గుడిలో కృష్ణ,విజయనిర్మల మీద ఒక పాటను చిత్రీకరించారు. అప్పుడు రాజబాబు కృష్ణ,విజయనిర్మలకు పెళ్లి అయ్యిపోతుందని అన్నారట.
అప్పుడు విజయనిర్మలకు కోపం వచ్చింది. ఆ తర్వాత కృష్ణ,విజయనిర్మల జంట హిట్ ఫెయిర్ గా పేరు తెచ్చుకుంది. చాలా సినిమాలు చేయటంతో వారి మధ్య సాన్నిహిత్యం పెరిగి ప్రేమగా మారింది. చంద్ర మోహన్ విజయనిర్మల వద్దకు వచ్చి కృష్ణ మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారని చెప్పగా,
మధ్యవర్తి ద్వారా చెప్పించటం ఎందుకు…నేరుగా వచ్చి అడిగితె పెళ్లి చేసుకుంటాను కదా అనడంతో, కృష్ణ విజయనిర్మలకు ప్రపోజ్ చేయటం ఆమె ఒకే చెప్పటం అన్ని వెంటవెంటనే జరిగిపోయాయి.