Movies

ఇష్టం లేని పెళ్లి చేసుకున్నందుకు శ్యామలకు తల్లి ఏ శిక్ష వేసిందో తెలుసా?

యాంకర్ శ్యామల బిగ్ బాస్ రెండో సీజన్ లో పార్టిసిపెంట్ గా ఉంది. ఆమె గురించి ఒక ఆశ్చర్యకరమైన విషయాన్నీ తెలుసుకుందాం. కాకినాడకు చెందిన శ్యామల తండ్రి చిన్నతనంలోనే చనిపోతే అన్ని తానై తల్లి పెంచింది. శ్యామల ఏది కోరిన కాదని అనకుండా తీర్చింది. శ్యామల సినిమాల్లో,సీరియల్స్ లో నటిస్తానని అనడంతో ఆమెకు ఇష్టం లేకపోయినా శ్యామల ఆనందం కోసం సరే అంది. అయితే శ్యామల తల్లి శ్యామల పెళ్లి కోసం తమ బంధువుల్లో ఒక అబ్బాయిని సెలక్ట్ చేసింది. అంతేకాక కూతురు తన మాట కాదని అనదని నమ్మకంతో వాళ్ళకి మాట కూడా ఇచ్చేసింది. సీరియల్స్ లో చాలా బిజీగా ఉన్న శ్యామలను ఇంటికి పిలిచి ఆమె తల్లి ఆమె చూసిన సంబంధం గురించి చెప్పింది.

కానీ శ్యామల నరసింహను ప్రేమిస్తున్నా అని అతన్నే పెళ్లి చేసుకుంటా అని తల్లికి చెప్పింది. కానీ తల్లి శ్యామలను నరసింహను మర్చిపోయి తాను చూసిన సంబంధంను చేసుకోవాలని నచ్చచెప్పింది. కానీ శ్యామల తల్లిని క్షమించమని చెప్పి నేను నరసింహనే పెళ్లి చేసుకుంటా అని చెప్పి వచ్చేసింది. శ్యామల పెళ్లి తల్లి అనుమతి,ఇష్టం లేకుండానే జరిగింది.

ఈ విషయం తెలుసుకున్న శ్యామల తల్లి చాలా బాధపడటమే కాకుండా కన్నీరు మున్నీరు అయింది. ఇక తనకు కూతురు లేదని ప్రతిజ్ఞ చేసుకొని కూతురుకి దూరంగా వెళ్ళిపోయింది. శ్యామల పెళ్లి అయిన దగ్గర నుండి ఇప్పటివరకు శ్యామల ఇంటి గడప తొక్కలేదు. అప్పుడప్పుడు ఫోన్ చేసి యోగక్షేమాలు కనుక్కుంటుంది. శ్యామల తల్లి కాశీలో దైవ సన్నిధిలో గడుపుతుంది.