Politics

పవన్ అడుగు జాడల్లో రేణు దేశాయ్ నడుస్తుందా… పవన్ కి అది ప్లస్…మైనస్…?

పవన్ కళ్యాణ్ రాబోతున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని సినిమాలకు దూరంగా పూర్తిగా తన సమయాన్ని రాజకీయాలకు కేటాయించాడు. ఈ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పవన్ రైతులతో కలిసి అమరావతి మార్చ్ పేరుతొ ఉద్యమాన్ని చేపట్టాలనే ఆలోచనలో ఉన్నాడు. పవన్ తన ఆలోచనలకు రూపు తేకుండానే రేణు దేశాయ్ మరొక రకంగా పవన్ అడుగుజాడల్లో నడుస్తుంది. ప్రస్తుతం రేణు దేశాయ్ తాను పెళ్లి చేసుకోబోయే వ్యక్తితో అమెరికాలో ఉంది. అమెరికా నుండి వచ్చాక ఒక తెలుగు సినిమాకి దర్శకత్వం వహిస్తుందట. ఈ సినిమా రైతుల సమస్యలను హైలెట్ చేస్తూ సామజిక కోణంలో సాగుతుందట.

ఇప్పటికే ఈ సినిమాకి సంభవించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తీ చేసిందని సమాచారం. ఈ సినిమాను రేణు దేశాయ్ స్వయంగా నిర్మిస్తుందని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా కోసం రేణు దేశాయ్ ఆంధ్రప్రదేశ్ తోమి ఒక గ్రామంలో కొన్ని రోజులు ఉండి రైతుల సమస్యలను తెలుసుకొని వాటిని సినిమాలో చూపెడుతుందని వార్తలు వస్తున్నాయి.

ఇప్పటికే రేణు తన మాతృబాష మరాఠీలో ‘ఇష్క్ వాలా లవ్’ సినిమాను స్వయంగా తీసి దర్శకత్వం వహించింది . ఆ సినిమా పెద్దగా విజయవంతం కాకపోయినా మరొక సినిమా తీయటానికి నడుం కట్టింది. అయితే ఇప్పుడు తెలుగులో సినిమాను స్వయంగా తీయటానికి రెడీ అయింది. ఈ సినిమాను పవన్ కళ్యాణ్ ఆలోచనలకు అనుగుణంగా తీస్తుంది. మరల రేణు పవన్ ఆశయాలకు అనుగుణంగా అడుగులు వేస్తుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.