‘ప్రేమించుకుందాం రా’ సినిమాలో వెంకటేష్ తో జోడి కట్టిన అంజలా జవేరి భర్త టాలీవుడ్ లో పెద్ద విలన్…ఎవరో తెలుసా?
‘ప్రేమించుకుందాంరా’ సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన అంజలా జవేరీ వెంకటేష్ తో జోడి కట్టింది. ఆ సినిమాలో కావేరిగా అందరిని ఆకట్టుకుంది. ఆ తర్వాత చూడాలని ఉంది, సమర సింహారెడ్డి, రావోయి చందమామ వంటి సినిమాలలో అగ్ర హీరోల సరసన నటించి మెప్పించింది. 2001 తర్వాత కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో మెరిసిన ఆ తర్వాత పెళ్లి చేసుకొని సినిమాలకు దూరం అయింది. అంజలా జవేరీ బాలీవుడ్ విలన్ తరుణ్ అరోరాను వివాహం చేసుకొని జీవితంలో సెటిల్ అయ్యిపోయింది. అంజలా జవేరీ భర్త ఖైదీ నంబర్ 150, కాటమరాయుడు సినిమాల్లో విలన్గా నటించి తెలుగులో కూడా బిజీ విలన్ గా మారాడు. అంజలా జవేరీ భర్త తరుణ్ అరోరా తనకంటే ఏడేళ్లు చిన్నవాడట.
టాలీవుడ్ లో మంచి పాత్రలు దొరికితే రీ ఎంట్రీ ఇవ్వటానికి సిద్ధంగా ఉందట. ఆమె ఇప్పటికే దర్శక,నిర్మాతలతో సంప్రదింపులు జరుపుతుందట. ఇప్పటికే నదియా, భూమిక, సిమ్రాన్, ఖుష్బూ, మీనా రీ ఎంట్రీ ఇచ్చారు..ఇప్పుడు అంజలి జవేరి కూడా వచ్చేస్తున్నది..