Movies

తమ్ముడు సినిమాలో పవన్ కళ్యాణ్ తో ఆడి పాడిన హీరోయిన్ ప్రీతీ జింగానియా ఏమి చేస్తుందో తెలుసా?

తమ్ముడు, నరసింహనాయుడు… వంటి సినిమాలతో అప్పట్లో అందాల హీరోయిన్‌గా పేరు సంపాదించుకున్న ప్రీతీ జింగానియా గుర్తుంది కదా… ఆ తర్వాత ఆమె బాలీవుడ్ కి వెళ్లి చాలా సినిమాలనే చేసింది. ప్రీతీ జింగానియా తెలుగులో చివరగా నటించిన సినిమాలు యమదొంగ, విశాఖ ఎక్స్‌ప్రెస్‌ సినిమాలు. యమదొంగ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ఒక పాటలో మెరిసింది. హిందీ సినిమాల్లో నటించాక బాలీవుడ్ నటుడు,దర్శకుడు పర్విన్‌ దబాస్‌ని వివాహం చేసుకొని సినిమాలకు దూరం అయింది. ఇప్పటివరకు ఇద్దరు పిల్లలను చూసుకుంటూ జీవితాన్ని గడిపేసింది. పిల్లలు కాస్త పెద్దవారు కావటంతో మరల రీ ఎంట్రీ ఇచ్చి హిందీతో పాటు ఇతర భాషల్లో కూడా నటిస్తోంది.

గత సంవత్సరం ప్రీతీ నటించిన రాజస్థానీ చిత్రం ‘టావ్డొ ద సన్‌లైట్‌’ బాక్సాఫీసు దగ్గర ఘన విజయం సాధించింది. నటనతో పాటు ప్రీతీ సొంత కంపెనీ ‘స్వెన్‌ ఎంటర్‌టెయిన్‌మెంట్‌’ పనులు కూడా చూసుకుంటూ చాలా బిజీగా ఉంది. ఒకవైపు సినిమాలు,కంపెనీ మరోవైపు పిల్లలను చూసుకుంటూ సక్సెస్ గా ముందుకు సాగుతుంది.