Devotional

సెప్టెంబర్ నెల మేష రాశి ఫలితాలు….వీరు దృఢ సంకల్పంతో పనిచేస్తే అన్నింటా లాభాలు పొందుతారు

మనలో చాలా మంది జాతకాలను నమ్ముతూ ఉంటారు. అయితే కొంత మంది జాతకాలను అసలు పట్టించుకోరు. జాతకాలను నమ్మే వారు మాత్రం వారి రాశిని బట్టి ఫాలో అవుతూ ఉంటారు. 12 రాశుల్లో ఈ రోజు మేష రాశి సెప్టెంబర్ నెల ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఈ రాశి వారికీ ప్రతికూలతలు,అనుకూలతలు తెలుసుకుందాం. ఈ నెలలో మేష రాశి వారికీ ఏదైనా ఒక పనిలో ఒక అంచనా వేసుకుంటే దానికి అనుగుణంగా పనులు జరుగుతాయి. వివాహం కానీ వారికీ వివాహం అయ్యే అవకాశాలు ఉన్నాయి. సోమరితనం కాస్త తగ్గుతుంది. వ్యక్తిగత కక్ష్యలు కూడా తగ్గుతాయి. అయితే కోపతాపాలు మాత్రం పెరిగే అవకాశాలు ఉన్నాయి.

ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు కాస్త ఆలోచన చేస్తే నిర్ణయ లోపాలు ఉండవు. ఉద్యోగంలో ఉన్నత పదవులు వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. వ్యాపారం అనుకూలంగా ఉండి ఆదాయ మార్గాలు కూడా చాలా బాగుంటాయి. ఈ నెలలో వీరికి మనోబలం పెరుగుతుంది. అయితే కాస్త ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం.

ఈ నెలలో భూలాభం కలిగే అవకాశాలు ఎక్కువగా కన్పిస్తున్నాయి. వీరు కాస్త వివాదాలకు దూరంగా ఉంటేనే మంచిది. వీరికి శత్రువుల మీద పైచేయి ఉంటుంది. వీరికి దూరప్రయాణాలు చేసే అవకాశాలు వస్తాయి. కాస్త జాగ్రత్తగా ఉంటే సంతృప్తి కలుగుతుంది. దూరప్రయాణాలు చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. విద్యార్థులు చదువులో ముందడుగు వేస్తారు.

వీరు దృఢ సంకల్పంతో ముందడుగు వేస్తె విజయాలు సొంతం చేసుకోవచ్చు. ఇతరులతో కాస్త సున్నితంగా వ్యవహరిస్తే ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కారం అవుతాయి. మొండిబకాయిలు వసూలు అవుతాయి.

ఈ నెలలో వీరికి కంటి సమస్యలు,గ్యాస్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఆరోగ్య సమస్యల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. వీరికి ఉన్న గ్రహ బాధలు తొలగాలంటే బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను కాకులకు వేయాలి.