Movies

పేపర్ బాయ్ సినిమా హీరోకి మహేష్ బాబు,ప్రభాస్ లకు ఉన్న లింక్ ఏమిటో తెలుసా?

సినిమా చిన్నదైనా సరే దానికి పబ్లిసిటీ కీలకం. ఆర్ ఎక్స్ 100,అర్జున్ రెడ్డి మూవీలు అందుకు నిదర్శనం. ప్రచారం ఉంటే దానికి సగం హిట్ అయినట్టే. అదేకోవలో పేపర్ బాయ్ సినిమాలో నటించిన హీరో తన సినిమా కోసం ఏకంగా ప్రభాస్,మహేష్ లను వాడేసుకుంటున్నాడు. ఇంతకీ పేపర్ బాయ్ హీరోకి మహేష్ , ప్రభాస్ లకు సంబంధం ఏమిటని ఆరా తీస్తే, ఇందులో వేసిన హీరో సంతోష్ శోభన్ ఎవరో కాదు గతంలో ప్రభాస్ హీరోగా వర్షం సినిమా తీసిన స్టార్ డైరెక్టర్ శోభన్ కుమారుడు. రామ్ గోపాల్ వర్మ దగ్గర అనగనగా మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరి, సినీమాల్లో అరంగేట్రం చేసాడు శోభన్.

ఆలా సినీ ప్రస్థానం స్టార్ట్ చేసిన శోభన్ ఆతర్వాత సొంతంగా డైరెక్షన్ మొదలుపెట్టి,మహేష్ తో బాబీ,ప్రభాస్ తో వర్షం తీసి తానేమిటో నిరూపించుకున్నాడు. రవితేజతో చంటి వంటి సినిమాలకు డైరెక్షన్ చేసాడు. అయితే 40ఏళ్ళ వయస్సులోనే హార్ట్ ఎటాక్ తో కన్నుమూశారు.

అతడు చనిపోయిన 10ఏళ్ళ తర్వాత ఆయన కుమారుడు సంతోష్ శోభన్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న పేపర్ బాయ్ సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇక అదేసమయంలో దర్శకుడు శోభన్ తో తమకు గల అనుబంధంతో పేపర్ బాయ్ మూవీ ప్రచార భారం మహేష్, ప్రభాస్ లు భుజాన వేసుకున్నారు.

జయ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీకి సంపత్ నంది , రాములు,వెంకట నరసింహ నిర్మాతలు. ఇక ఈ మూవీ థియేటర్ హక్కులను గీతా ఆర్ట్స్ కొనుగోలు చేయడంతో సగం భారం తగ్గింది. పేపర్ బాయ్ ట్రైలర్ అద్భుతంగా ఉందంటూ మహేష్ ట్వీట్ చేస్తూ, దివంగత శోభన్ తో పనిచేసిన అనుభవాన్ని గుర్తుచేసుకున్నాడు.

అదే విధంగా ప్రభాస్ కూడా పేపర్ బాయ్ ట్రైలర్ ను చిత్రం యూనిట్ చూపించింది. ఇది చూసిన ప్రభాస్ ఈ మూవీని మెచ్చుకుంటూ, విజువల్స్ చాలా బాగున్నాయని,శోభన్ వర్షం మూవీతో తన కెరీర్ నిలబెట్టారని, ఇప్పుడు సొంతోష్ శోభన్ కూడా మంచి పొజిషన్ కి వస్తాడని పేర్కొన్నాడు. బిల్లాకు పనిచేసిన సౌందర రాజన్ పేపర్ బాయ్ కి అద్భుత ఫొటోగ్రఫీ అందించారని కితాబిచ్చాడు. ఇక రవితేజాతో కూడా శోభన్ పనిచేయడం వలన రవితేజను కూడా వాడేస్తాడేమోనని అంటున్నారు.