మనీ మనీ సినిమాలో నటించిన సురభి ఇప్పడు ఎక్కడ ఎలా ఉందో తెలిస్తే మతిపోతుంది
మిగిలిన మాట ఎలా ఉన్నా తెలుగు సినీ రంగంలో నటించి మెప్పిస్తే, అది ఒక సినిమా అయినా కావచ్చు అలాంటి వాళ్ళను తెలుగు ప్రేక్షకులు జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. వాళ్ళు ఎక్కడ ఎలా ఉన్నారో అనే ఆతృత కూడా ఉంటుంది. సరిగ్గా ఇదే కోవలో సురభి అనే నటి వుంది. ఎందుకంటే, సరిగ్గా పాతికేళ్ల క్రితం తెలుగులో తళుక్కున మెరిసిన ఈ అందమైన భామ నిజానికి చెంకోల్ అనే మలయాళ సినిమాతో తెరంగేట్రం చేసింది.
ఇది కిరీటం అనే సినిమాకు సీక్వెల్. ఇక ఆతర్వాత తెలుగులో అల్లరోడు,బంగారు మొగుడు,పల్నాటి పౌరుషం,కేటు – డూప్లికేటు వంటి 10 సినిమాల్లో నటించింది. అందులో మనీ మనీ మూవీ కూడా ఉంది. ఇది కూడా తెలుగులో సీక్వెల్ గా వచ్చిన సినిమాయే.
వాస్తవానికి మనీ మనీయే ముందు విడుదల కావాల్సి వున్నా కొన్ని కారణాల వలన వెనుక వచ్చింది. యాదృచ్ఛికమో ఏమో గానీ,ఇలా రెండు భాషల్లో సీక్వెల్ సినిమాల్లో నటించిన ఘనత సురభి సొంతం. ఇక కన్నడంలో రాఘవేంద్ర రాజకుమార్,విష్ణు వర్ధన్ తో నటించిన సురభి కేవలం రెండేళ్లు మాత్రమే సినిమాల్లో నటించింది.
అయితే ఆతర్వాత హఠాత్తుగా మాయమైన సురభి,గుజరాతీ దర్శకుడు ధర్మేశ్ వ్యాస్ ని పెళ్లాడింది. ఇతనితో పలు టివి షోలు, గుజరాతీ స్టేజ్ షోలు చేసింది. అయితే పెళ్లయిన స్టేజ్ షోలు చేయడం విశేషం అయినా అప్పటికే ఆమె ఫేడ్ అవుట్ అయింది. ఇక ఆమె చేసిన టివి సీరియల్స్ చాలావరకూ మనవాళ్ళు కూడా చూసే వుంటారు.
కలర్స్ , లైఫ్ ఒకే,జిటివి వంటి చానల్స్ లో ప్రసారం అయిన సీరియల్స్ చూస్తే, ఎవరూ గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. ఆమె గతంలోని రూప లావణ్యం కనిపించదు. మధ్య వయస్సు పాత్రలు,అత్త పాత్రలతో అలవాటు పడిన ఈమె 2015వరకూ టివి సీరియల్స్ లో కనిపించింది. ప్రస్తుతం తల్లి కావడంతో అవి కూడా మానేసిందని తెలియవచ్చింది.