విజయశాంతి చెల్లెలు టాప్ హీరోయిన్…ఆమె ఇప్పుడు ఏమి చేస్తుందో తెలుసా?
ఏ రంగమైనా సరే రాణింపు ఉంటేనే గుర్తింపు. ఇక సినీ రంగం అయితే మరీను. ఎక్కడ తేడా వచ్చినా ఇక ఇంతే సంగతులు. ఆలాంటి చిత్ర సీమలో వుండే విచిత్రాల్లోకి వెళ్తే, ఆలాగే ఓ పెద్ద యాక్షన్ హీరోయిన్ కి కూతురు వరస,ఓ స్టార్ హీరోయిన్ కి సిస్టర్. అంత బ్యాక్ గ్రౌండ్ గల హీరోయిన్ ఓ వెలుగు వెలిగిపోవాలి. కానీ,సీన్ రివర్స్ అయింది. ఇంతకీ ఆమె ఎవరంటే,విజయ రేఖ. ఒకప్పుడు యాక్షన్ చిత్రాలతో పాటు లేడీ ఓరియెంటెండ్ పాత్రలతో రాణించి, లేడీ అమితాబ్ గా పేరొందిన విజయశాంతికి ఆమె చెల్లెలు.
ఇంకొంచెం వివరాల్లోకి వెళ్తే, విజయలలిత అనే ఓ యాక్షన్ క్వీన్ అప్పట్లో బాగా పాపులర్. ఆమెకు ఓ అక్క, మరో చెల్లి వున్నారు. అక్క కూతరు విజయశాంతి అయితే చెల్లెలు కూతురు విజయ రేఖ. అయితే సినీ రంగంలోకి అడుగుపెట్టిన విజయశాంతి అనతికాలంలోనే స్టార్ హీరోయిన్ అయిపొయింది. ఓ వెలుగు వెలుగుతున్న అదేసమయంలో అంటే 1990దశకంలో విజయ రేఖ కూడా ఎంట్రీ ఇచ్చింది.
అయితే పెద్ద డైరెక్టర్లు ఆమెను పట్టించుకోకపోవడంతో అంతగా పేరులేని దర్శకులు ఆమెకు ఛాన్స్ లు ఇచ్చారు. ఇక అప్పట్లో సినీ ప్రేక్షకులకు ఎంతోకొంత చేరువైన సినిమా అంకితం. అందులో హీరోయిన్ వేసింది విజయ రేఖ. బందెల ఈశ్వరరావు డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీలో సురేష్ హీరోగా వేసాడు. ఆతర్వాత గెద్దాడ ఆనంద్ బాబు అనే దర్శకుడు తీసిన నా పెళ్ళాం నా ఇష్టం అనే మూవీలో నరేష్ సరసన విజయ రేఖ నటించింది.
ఆతర్వాత ప్రేమ ద్రోహి సినిమాలో విజయ రేఖ నటించింది. పైగా పాతికేళ్ళు కూడా లేని వయస్సులో 50ఏళ్ళ మహిళ పాత్రలో సినిమా అర్ధ భాగంలో కనిపిస్తుంది. రఘువరన్ కీలక పాత్ర పోషించిన ఈ చిత్రం ఏ మాత్రం ప్రేక్షక ఆదరణకు నోచుకోలేదు. కనీసం దూర దర్శన్ లో ప్రసారమయ్యే టివి సీరియల్ సాటి కూడా రాలేని పరమ బోర్ సినిమా గా మిగిలింది. ఇక అడపా దడపా చిన్న చిన్న క్యారెక్టర్స్ కి పరిమితం అయిన విజయ రేఖ ఆతర్వాత పూర్తిగా కనుమరుగైంది. పెళ్లి చేసుకుని సినీ రంగానికి దూరం అయింది.