ఆనాటి స్టార్ కమెడియన్ రమణారెడ్డి కొడుకు టాలీవుడ్ ప్రముఖుడని మీకు తెలుసా ?
తెలుగు సినీ రంగంలో గుర్తు పెట్టుకోవాల్సిన ప్రముఖ హాస్య నటుల్లో చెప్పుకోవాల్సి వస్తే, రమణా రెడ్డి పేరు చెప్పి తీరాలి. తన హాస్యంలో జనాన్ని కడుపుబ్బా నవ్విస్తూ,ప్రేక్షక హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న రమణారెడ్డి తెరమీద కనిపిస్తే చాలు జనానికి నవ్వుల పండగే అని ఉండేది. అంతేకాదు మ్యాజిక్ కూడా తెల్సిన నవ్వుల మాంత్రికుడు ఈయన. మాయపిల్ల మూవీతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఈయన సానిటరీ ఇనస్పెక్టర్ గా పనిచేసేవారు. సినిమాలపై గల మోజుతో మద్రాసు చేరుకొని, ఎన్నో కష్టాలు చవిచూసి సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నారు. ఆ రోజుల్లో ఎన్టీఆర్, అక్కినేని పక్కన పోటాపోటీగా నటించిన ఈయన 24ఏళ్ల సినీ జీవితంలో 200సినిమాలు పూర్తిచేసుకున్నారు. ఈయన గొప్ప మెజీషియన్ కూడా. డబ్బుకోసం సినిమాలు చేస్తున్నానని,ప్రజలకోసం మ్యాజిక్ చేస్తున్నానని ఆరోజులలో రమణారెడ్డి చెప్పేవారు.
ఇక తెలుగు సినీ రంగంలో గయ్యాళి అత్తపాత్రలో ఒదిగిపోయిన సూర్యకాంతంతో కల్సి ఎన్నో సినిమాల్లో నటించిన రమణారెడ్డి ముఖ్యంగా భార్యకు భయపడే పాత్రలో,చివరకు ఒళ్ళుమండి భార్యనే భయపెట్టే రీతిలో చేసిన సన్నివేశాలు రక్తి కట్టాయి. ఇక ఆ రోజులలో స్టార్ కమెడియన్ గా వెలుగొందిన రేలంగితో కల్సి రమణారెడ్డి ఎన్నో సినిమాల్లో నటించారు.
తండ్రిగా, బావగా, అన్నదమ్ములుగా, మామా అల్లుళ్లుగా ఇలా ఎన్నో పాత్రల్లో వీరిద్దరూ రాణించారు. వేడితెరపై తిరుగులేని హాస్య జంట గా పేరొందిన వీళ్లిద్దరి మధ్య మంచి అనుబంధం కూడా ఉండేది. సినిమాల్లో కడుపుబ్బా నవ్విస్తూ, తన పాత్రతో నవ్వుల పువ్వులు పూయించే రమణారెడ్డి నిజజీవితంలో సీరియస్ గా ఉండేవారని చెబుతారు.
ఇదంతా పక్కనపెడితే తనదగ్గరకు సాయం కోసం వచ్చేవాళ్లకు లేదనకుండా సాయపడడం లో కూడా ఆయనకు ఆయనే సాటి.ఇంతటి గొప్ప స్టార్ కమెడియన్ కొడుకు కూడా ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్ లో ప్రముఖ వ్యక్తిగా రాణిస్తున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే అమితాబ్ వంటి టాప్ స్టార్, క్రికెట్ ధీరుడు సచిన్ టెండూల్కర్, పారిశ్రామిక దిగ్గజం అనిల్ అంబానీ, బడా పొలిటీషియన్స్ ఇలా అందరినీ ఒకేవేదిక మీదకు రప్పించి కార్యక్రమాలు నిర్వహించే ప్రముఖ పారిశ్రామిక వేత్త, సినీ నిర్మాత, ప్రముఖ రాజకీయ వేత్త టి సుబ్బరామిరెడ్డి అందరికీ తెల్సు కదా.
ఈయన 1943సెప్టెంబర్ 17న నెల్లూరు జిల్లాలో టి బాబురెడ్డి, రుక్మిణమ్మ దంపతులకు జన్మించారు. నిజాం కాలేజీలో డిగ్రీ వరకూ చదివిన ఈయన ఆతర్వాత వ్యాపార రంగంలో కాలుమోపి,ఒక్కో మెట్టు ఎక్కుతూ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులను పూర్తిచేసి, దేశంలో టాప్ మోస్ట్ బిజినెస్ మ్యాన్ గా ఎదిగారు. ఈయన భార్య పేరు టి ఇందిర గాయత్రి గ్రూప్ ఆఫ్ ప్రాజెక్ట్స్. కి చైర్మన్ గా ఉన్నారు. వీరికి సందీప్ రెడ్డి, పింకీ రెడ్డి అనే ఇద్దరు సంతానం.
ఫ్యాషన్ డిజైనర్ గా రాణిస్తున్న సుబ్బరామిరెడ్డి కూతురు పింకీ రెడ్డి సినిమాల్లో మెగాస్టార్ చిరంజీవి,నాగార్జున, వెంకటేష్ వంటి వారికీ ఫ్యాషన్ డిజైనర్ గా వ్యవహరించింది. ఇక అసలు విషయానికి వస్తే, సుబ్బరామిరెడ్డికి రమణారెడ్డికి ఉన్న లింక్ చాలా కొందిమందికి మాత్రమే తెల్సు. ఇంతకీ సుబ్బరామిరెడ్డికి రమణారెడ్డి స్వయానా బాబాయ్.