Devotional

వినాయక చవితి రోజు ఆలయంలో వీటిని సమర్పిస్తే జీవితంలో విఘ్నాలు అన్ని తొలగిపోయి సుఖ శాంతులు కలుగుతాయి

వినాయక చవితి సెప్టెంబర్ 13 న వచ్చింది. మనం ఏ పని తలపెట్టిన విఘ్నాలు రాకుండా ఉండాలంటే మొదట వినాయకుడికి పూజ చేసి ఆ తర్వాతే ఆ పనిని మొదలు పెడుతూ ఉంటాం. వినాయక చవితి రోజు ఇంటిలో పూజ అయ్యాక ఆలయానికి వెళుతూ ఉంటాం. ఆలా ఆలయానికి వెళ్ళినప్పుడు ఏమి చేయాలో చాలా మందికి తెలియదు. వినాయకుని గుడికి వెళ్ళినప్పుడు కొన్ని విషయాలను ఫాలో అయితే చాలా మంచి జరుగుతుంది. ఇప్పుడు ఆ విషయాల గురించి తెలుసుకుందాం. ఆలయానికి వెళ్ళాక నమస్కారం చేసి మూడు గుంజీలు,13 ఆత్మ ప్రదక్షిణలు చేయాలి. వినాయకునికి కొబ్బరి పువ్వులు లేదా వెదురు పుష్పాలు లేదా వెలగ పుష్పాలను అలంకరణ కోసం సమర్పించాలి.

ఈ పువ్వులు దొరకక పొతే 21 గరిక గుచ్ఛాలను వినాయకునికి సమర్పించాలి. కొబ్బరి బొండం,వెలక్కాయ,చెరకు ముక్కలు నైవేద్యంగా సమర్పించాలి. వినాయకుని గుడికి వెళ్ళినప్పుడు 5 ప్రదక్షిణాలు చేయాలి. వినాయకుడుకి నీటితో కాకుండా కొబ్బరి నీరు మరియు చెరకు రసంతో అభిషేకం చేస్తే వ్యాపారంలో బాగా కలిసివస్తుంది.

అదే చదువుకొనే పిల్లలు అయితే చదువు బాగా వస్తుంది. అలాగే ఇంటిలో ఎటువంటి విఘ్నాలు లేకుండా ఆనందంగా ఉంటారు. వినాయకుణ్ణి తెల్ల జిల్లేడు పువ్వులతో పూజిస్తే అనుకున్న పనులు ఎటువంటి ఆటంకాలు లేకుండా జరుగుతాయి.

తెల్ల జిల్లేడు వేరును అరగదీసి ఆ గంధంతో వినాయకుణ్ణి పూజిస్తే కోరుకున్న కోరికలు తొందరగా తీరతాయి. కాబట్టి విఘ్నాలను తొలగించే వినాయకుడికి వీటిని సమర్పిస్తే జీవితంలో విఘ్నాలు తొలగిపోయి సుఖ శాంతులు కలుగుతాయి.