Devotional

ఏ గ్రహ దోషానికి ఏ వినాయకుణ్ణి పూజిస్తే ఆ దోషం తొలగిపోయి….. ఆ గ్రహ బాధల నుండి విముక్తి పొందవచ్చు

వినాయకుణ్ణి విఘ్నాలు తొలగించే విఘ్నా నాయకుడిగా కొలుస్తాం. ఏ పని తలపెట్టిన మొదట వినాయకుడికి పూజ చేసి మాత్రమే మొదలు పెడతాం. ఆలా చేస్తే చేసే పనిలో ఎటువంటి విఘ్నాలు రావని ఒక నమ్మకం. వినాయకచవితి పూజలో వినాయకుణ్ణి ప్రతిస్థించి తొమ్మిది రోజులు పూర్తి అయ్యాక నిమ్మజ్జనం చేయటం ఆచారంగా వస్తుంది. మనకు వచ్చే ఎన్నో సమస్యలకు గణపతిని పూజిస్తే పరిష్కారం లభిస్తుంది. అయితే ఏ దోషము ఉన్నవారు ఏ గణపతిని పూజిస్తే దోషాలు తొలగుతాయో వివరంగా తెలుసుకుందాం

ఎర్రచందనంతో చేసిన గణపతిని పూజిస్తే సూర్య దోషాలు తొలగిపోతాయి

పాలరాయితో చేసిన వినాయకుడిని చంద్ర దోషాలు తొలగిపోతాయి.

చాలా మంది అమ్మాయిలకు,అబ్బాయిలకు కుజ దోషము ఉంటుంది. అలాంటి వారు రాగితో చేసిన వినాయకుడ్ని పూజిస్తే మంచి జరుగుతుంది.

మురకత గణపతిని పూజిస్తే బుధ దోషం నివారణ జరుగుతుంది.

పసుపు గణపతిని పూజిస్తే గురు గ్రహ దోషాలు తొలగిపోతాయి.

స్ఫటిక గణపతిని పూజిస్తే శుక్ర గ్రహ బాధలు తొలగిపోతాయి.

నల్లరాయిపై చెక్కిన గణపతిని పూజిస్తే శని బాధలు తొలగిపోతాయి.

మట్టితో చేసిన గణపతిని పుజిస్తే రాహువు కారణంగా వచ్చే సమస్యలు తొలగిపోతాయి.

తెల్ల జిల్లేడు వేరుతో చేసిన వినాయకుణ్ణి పూజిస్తే కేతువు కారణంగా వచ్చే సమస్యలు తొలగిపోతాయి.

ఎర్రచందనంతో చేసిన గణపతిని పూజిస్తే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి.

ఈ విధంగా వినాయకుడికి పూజ చేస్తే దోషాలు,సమస్యలు అన్ని తొలగిపోయి ప్రశాంతత కలుగుతుంది. కాబట్టి మీరు కూడా మీ జాతకాన్ని చూపించుకొని మీకు ఉన్న దోషాన్ని బట్టి వినాయకుణ్ణి పూజించండి.