Movies

అందాలరాముడు’ సినిమాలో ANR ఎత్తుకున్న ఈ ‘పాప’ ను గుర్తు పట్టారా… టాప్ స్టార్ హీరోయిన్

ఒక్కో పాత్రకు ఒక్కక్కరు సూటవుతారు. ఇక కొన్ని పాత్రల బరువు మన ఊహకు అందదు. భావోద్వేగం కలిగే సన్నివేశాల్లో నటించి మెప్పించడం అందరికీ అంత ఈజీ కాదు కూడా. ఇంతకీ అసలు విషయంలోకి వెళ్తే,ఒకప్పుడు, ఎస్వీఆర్, ఎన్టీఆర్, అక్కినేని,శోభన్ బాబు, మోహన్ బాబు, చంద్రమోహన్ వరకూ ఆతర్వాత వచ్చిన కృష్ణ, వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జున ఇలా ఇలా అగ్ర హీరోలందరికీ చెల్లెలు పాత్రలో మెప్పించిన వరలక్ష్మి గుర్తుందా? నిజానికి ఈమె హీరోయిన్ అవుదామనుకుని ఇండస్ట్రీకి వచ్చి, సపోర్టింగ్ రోల్స్ వేస్తూ, చివరకి చెల్లెలిగా అందరి యాక్టర్ల సరసన ఒదిగిపోయింది. ఈమె తప్ప చెల్లెలి పాత్రకి మరొకరు సరిపోరు అనే పేరు సొంతం చేసుకుంది.

అయితే వరలక్ష్మి చిన్నప్పుడు బాలనటిగా కూడా రాణించింది. అలనాడు బాపు తీసిన అందాల రాముడు మూవీ మొత్తం గోదావరి మీద పడవపైనే షూటింగ్ చేసిన ఈచిత్రంలో ఎదగడానికి ఎందుకురా తొందరా అనే పాటలో అక్కినేని ఎత్తుకున్న పాప ఎవరో కాదు వరలక్ష్మే. సినిమా అంటే ఏమిటో కూడా తెలియని వయసులో చైల్డ్ ఆర్టిస్ట్ గా రంగప్రవేశం చేయడానికి ఓ బలమైన కారణం కూడా ఉంది.

ఈమె తండ్రి సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాల్లో నటించాడు. ఆలా తనతో పాటు షూటింగ్ తీసికెళ్ళిన వరలక్ష్మిని చూసిన యాక్టర్ రమాప్రభ ‘ఈమె చాలా ముద్దుగా ఉంది. ఓ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ అవసరం కూడా ఉంది . మీరు ప్రయత్నించండి’అంటూ ఆమె తండ్రికి సలహా ఇవ్వడం బానే వర్కవుట్ అయింది.ఆ విధంగా రమాప్రభ వలన సినీమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా వెతుక్కుంటూ వచ్చిన అవకాశం వరలక్ష్మి కి వరమైంది.

తెలుగు, కన్నడ, మలయాళం,తమిళం, హిందీ భాషల్లో కూడా నటించింది. బాలనటిగా వయస్సు దాటిపోవడంతో హీరోయిన్ వేషం కోసం ప్రయత్నించింది. కానీ చెల్లెలి పాత్రలే వచ్చాయి. దీంతో అందరి హీరోల సరసన చెల్లి పాత్రలో రాణించింది. అంతేకాదు ఈమె చెల్లెళ్ళు వాణి,సరస్వతి లు ఇద్దరూ కూడా తెలుగు తమిళ సినిమాల్లో నటించారు. వరలక్ష్మి సినిమాల నుంచి తప్పుకుకుని ఎన్నో సీరియల్స్ లో నటించింది. వాణి కూడా ప్రస్తుతం తమిళ సీరియల్స్ లో నటిస్తోంది. ఇక వరలక్ష్మికి ఓ కూతురు ఉంది.