టాలీవుడ్ లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన టాప్ 10 సినిమాలు
తెలుగు సినిమాలు మరి ఏ రంగానికి తీసిపోకుండా భారీ వ్యవయంతో నిర్మాణం అవుతూ , హాలీవుడ్ ని కూడా మరపిస్తున్నాయి. ఇక కలెక్షన్ల వాన కూడా కురుస్తోంది. ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాల్లో టాప్ టెన్ లో ఉన్న సినిమాలను పరిశీలిస్తే, బాహుబలికి సీక్వెల్ గా తీసిన బాహుబలి కంక్లూజన్ 1742కోట్లు కలెక్ట్ చేసి అగ్రస్థానంలో ఉంది. ఇక బాహుబలి ది బిగినింగ్ 602కోట్లతో రెండో స్థానం ఆక్రమించింది. ఈ రెండు చిత్రాలు ప్రభాస్ హీరోగా, రానా ప్రధాన పాత్రతో ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించాడు. రామ్ చరణ్ నటించిన రంగస్థలం 214కోట్లు వసూలు చేసి,మూడవ ప్లేస్ లో ఉంది.
ఇక చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చి నటించిన ఖైదీ నంబర్ 150 మూవీ 164కోట్లు వసూలు చేసింది. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన భరత్ అను నేను 160 కోట్లు కలెక్ట్ చేసి 5వ స్థానాన్ని ఆక్రమించింది. శ్రీమంతుడు మూవీ 144కోట్లు వసూలు చేయడంతో 6వ స్థానంలో కూడా మహేష్ నిలిచాడు.
ఇక రామ్ చరణ్ నటించిన మరో మూవీ మగధీర 136 కోట్లు వసూలు చేసి,7వ స్థానంలో నిలిచింది. కాగా పవర్ స్టార్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది మూవీ 131కోట్లు వసూలు చేసి,8వ స్థానం కొట్టేసింది. జూనియర్ ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ 125కోట్లతో 9వ ప్లేస్ లో నిలిస్తే, ఇంచుమించు అదే కలెక్షన్ తో సరైనోడు 10వ ప్లేస్ సాధించింది. ఇదండీ అగ్ర హీరోల ఫెరఫార్మెన్స్ .