రెబల్ స్టార్ కృష్ణం రాజు జనసేనలోకి…అసలు విషయం ఏమిటో చూడండి
ఇక ఎన్నికల సీజన్ దగ్గర పడుతోంది. ఆయా పార్టీలు తమ తమ కార్యాచరణతో జనంలోకి వెళుతున్నారు. ఇక గత ఎన్నికల్లో బిజెపి,టిడిపిలకు సపోర్ట్ చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో పోటీకి సై అంటున్నారు. జనంలోకి దూసుకెళ్తున్నారు. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో పవన్ కి ఎక్కువగా ఫాలోయింగ్ కనిపిస్తోంది. ఇప్పటికే వైస్సార్ సిపి, కాంగ్రెస్ లనుంచి కీలక నేతలు జనసేనలోకి వస్తున్నారు. గోదావరి జిల్లాల్లో టికెట్ల కేటాయింపుపై కసరత్తు మొదలెట్టిన పవన్ తొలి టికెట్ కూడా ముమ్మిడివరం బిసి వర్గానికి చెందిన పితాని బాలకృష్ణను అభ్యర్థిగా ప్రకటించారు. గోదావరి జిల్లాల్లో 36సీట్లు ఉన్నాయి.
ఇక్కడ క్లిన్ స్వీప్ చేస్తే కింగ్ మేకర్ గా ఎదగవచ్చన్నది ప్లాన్. ఎందుకంటే, గోదావరి జిల్లాల్లో ఎవరికి మెజార్టీ వస్తే వాళ్ళే అధికారంలోకి వస్తారన్న సెంటిమెంట్ కూడా ఉండనే ఉంది.ఇక పశ్చిమ గోదావరి జిల్లాపై దృష్టిపెట్టిన పవన్ చాలానే కసరత్తు చేస్తున్నారు. ఈ ప్రాంతం నుంచి ముఖ్యంగా నరసాపురం ఎంపీ అభ్యర్థిగా ఎవరిని రంగంలోకి దింపాలా అని యోచన చేస్తున్నారు.
టిడిపి, వైసిపి లనుంచి క్షత్రియ సామాజిక వర్గం నుంచి అభ్యర్థులు రంగంలో దిగనున్నారు. పవన్ కూడా అదే సామాజిక వర్గంపై ద్రుస్తి పెట్టారు. ఈదశలో రెబల్ స్టార్ కృష్ణంరాజు ని నిలబెడితే బాగుంటుందన్న ఆలోచన చేస్తున్నారట. కృష్ణంరాజు ఒప్పుకుంటే ఇక టికెట్ అన్నది లాంఛనమే. 1991లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఇక్కడ నుంచి పోటీచేసి ఓడిపోయిన కృష్ణంరాజు 1998లో కాకినాడ నుంచి బిజెపి అభ్యర్థిగా పోటీచేసి, ఘనవిజయం సాధించారు.
ఆతర్వాత వాజ్ పాయి ప్రభుత్వం ఒక్క ఓటుతో పడిపోవడంతో వచ్చిన మంధ్యంతర ఎన్నికల్లో నరసాపురం నుంచి బిజెపి తరపున టిడిపి పొత్తుతో పోటీచేసి కృష్ణం రాజు గెలిచారు. వాజపేయి ప్రభుత్వంలో రక్షణ శాఖ సహాయమంత్రిగా పనిచేసారు. 2009లో ప్రజారాజ్యంలో చేరి,రాజమండ్రి నుంచి పోటీచేసి ఓటమి చెందారు.
నరసాపురంలో రాజుల అండ, హీరో ప్రభాస్ అభిమానుల సపోర్ట్ అన్నీ ఆయనకు కలసివస్తాయి. ఇక కృష్ణంరాజు కూడా బిజెపి పట్ల అసంతృప్తితో జనసేనవైపు చూస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. అన్నీ అనుకూలిస్తే కృష్ణంరాజు ఎంపీగా నిలబడితే జనసేన ఖాతాలో ఓ ఎంపీ సీటు ఖాయమనే మాట వినిపిస్తోంది.