Movies

ఇండస్ట్రీలో సెటిల్ అవ్వటానికి ఎన్ని కష్టాలు పడాలో చెప్పిన అవసరాల శ్రీనివాస్… ఆ కష్టాలు అవసరమా శ్రీనివాస్?

ఏ రంగంలో నైనా పోటీ ఉండడం సహజం. కానీ ఆయా రంగాల్లో నిలదొక్కుకోవాలంటే చాలా కష్టం. ఎన్నో అవమానాలు,సమస్యలు ఎదుర్కోవాలి. చీదరింపులు, ఛీత్కారాలు సరేసరి. ఇక సినీ రంగంలో అయితే చెప్పక్కర్లేదు. జూనియర్స్ పట్ల కొందరు సీనియర్స్ శాడిజం కూడా ప్రదర్శిస్తారట. కొట్టడం ,తన్నడం కూడా చేస్తుంటారట. కాలేజీల్లో ర్యాగింగ్ ని మించిపోయి సినీమా రంగంలో జూనియర్స్ పట్ల సీనియర్స్ వ్యవహరిస్తారట. తమకన్నా టాలెంట్ ఎక్కువ ఉందని గమనిస్తే చాలు, కసితో శాడిజం ప్రదర్శిస్తూ, చెప్పులు లేకుండా ఎండలో పరుగెత్తే సీన్స్ చేయమనడం,బండ బూతులు తిట్టడం వంటివి చేస్తారట.

వీటన్నింటినీ తట్టుకుని నిలబడ్డం చాలా కష్టం. ఇలాంటి ఇన్నో కష్టాలు పడ్డాడట నటుడు,డైరెక్టర్ అవసరాల శ్రీనివాసరావు. అవసరాల సత్యనారాయణ మూర్తి, నాగమణి దంపతులకు జన్మించిన శ్రీనివాసరావు నిజానికి మెకానికల్ ఇంజనీర్. అమెరికాలో పెద్ద ఇంజనీర్ గా లైఫ్ ఎంజాయ్ చేస్తూ, సినిమాల్లో ఇంట్రెస్ట్ కొద్దీ, కాలిఫోర్నియా యూనివర్సిటీలో , లాస్ ఏంజిల్స్ యూనివర్సిటీలో నటన,రచన,దర్శకత్వం,సింగింగ్ వంటి వాటిలో ప్రావీణ్యం పొందారు.

న్యూయార్క్ లో యాక్టింగ్ క్లాస్ లో ఏడాది శిక్షణ కూడా తీసుకున్నారు. హైదరాబాద్ వచ్చాక అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరిన శ్రీనివాసరావు అష్టా చెమ్మా మూవీతో గుర్తింపు పొందాడు. ఊహలు గుసగుసలాడే చిత్రంతో నటుడిగా, డైరెక్టర్ గా విజయాన్ని నమోదుచేసుకున్నాడు. నీలో క్వాలిఫికేషన్స్ తప్ప టాలెంట్ లేదని మొదట్లో అవసరాలను పలువురు అవమానించారట.

ఆధ్యాత్మిక విషయాలు చెప్పే తనికెళ్ళ భరణి అంటే ఈయనకు ఎంతో అభిమానం. ఇక ఇండస్ట్రీలో ద్వేషం, కుళ్ళు అన్నీ చూశానని చెబుతాడు. కొందరి దగ్గరకు వెళ్లి ఛాన్స్ లు అడిగితే, నీవు ఓవర్ క్వాలిఫైడ్,నీలాంటి వాళ్ళతో వేగలేం బాబు అంటూ చీదరించుకునేవారట. ఇక ఓ దర్శకుని దగ్గరకు వెళ్తే,రెండు మూడు గంటలు నిలబెట్టి ఇంకా ఇక్కడ ఎందుకున్నావ్ అంటూ శాడిజం ప్రదర్శించాడట.

ఓ సినిమా వేడుకకు వెళ్తే,నువ్వు ఎందుకొచ్చావ్,నీకు పనీపాటా లేదా అని తిట్టి పంపించేసాడట. భోజనం చేస్తుంటే,ప్లేట్ లాగేశారట. ఎండలో కుర్చీ వేసి కూర్చోబెట్టేవాడట. డైరెక్టర్ కి మీరంటే ఇష్టం లేకపోవడం వల్లనే ఇలా అవుతోందని,ఇందులో మా తప్పు లేదని ప్రొడక్షన్ వాళ్ళు వివరణ ఇచ్చుకునేవారట. ఇక ఓ నిర్మాత అనే మాటలు భరించలేక ఛాలెంజ్ చేసి వచ్చేసాడట.

ఏ చెడ్డ అలవాట్లు లేకపోవడం కూడా సినీ రంగంలో మైనస్ పాయింట్ అని అవసరాల తన అనుభవాలను ఓ మీడియాతో పంచుకుంటూ చెప్పుకొచ్చాడు. అసలు నీవు మగాడివేనా అంటూ కొందరు నానా మాటలు అంటుంటే తరుక్కుపోయేదని, చాలా బాధపడేవాడినని వివరించాడు. తనను చిత్ర హింసలకు గురిచేసిన వారిని మించి ఎదగడమే తన లక్ష్యమని చెప్పే అవసరాల, పిల్ల జమీందార్, కంచె , ఆరెంజ్ ,సరదాగా కాసేపు,వరప్రసాద్ – పొట్టి ప్రసాద్,గోల్కొండ హైస్కూల్ ,ముగ్గురు,చందమామలో అమృతం,సుకుమార్, చెమ్మకు చెల్లు, గోవిందుడు అందరి వాడేలే,ఎవడే సుబ్రహ్మణ్యం,బందిపోటు,నాన్నకు ప్రేమతో,రాజా చెయ్యి వేస్తే,అ ఆ,జెంటిల్ మెన్,ఒక మనసు,జ్యో అచ్యుతానంద,బాబు బాగా బిజీ, అమీ తుమీ,మేడమీది అబ్బాయి,ఒక్క క్షణం,ఇలా ఎన్నో చిత్రాల్లో నటించాడు.

ప్రస్తుతం ఆర్ధికంగా ఇబ్బందుల్లో ఉన్నాడట. అందుకే అప్పుడే పెళ్లి ఊసు లేదని చెబుతుంటాడు.అయితే, తెలుగు హీరోయిన్ ఇషా హెబ్బతో ప్రేమలో ఉన్నాడని, ఆమెతో అవసరాల డేటింగ్ చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. తన జీవితంలో ఎక్కువగా ఆస్తమాతో బాధపడ్డ తాను ప్రాణిక్ హీలింగ్ తో దారిలో పడ్డానని, ఆధ్యాత్మికతను నమ్ముతానని చెబుతుంటాడు. ఇక తన కలలో వచ్చిన వ్యోమగామి సంబంధిత అంశాలతోనే చందమామ అమృతంలో సినిమాతో నిజమవ్వడంతో టెలీపతిని,ఇతర విషయాలను బాగా ఆచరిస్తానని అంటాడు.