Movies

శ్రీకాంత్ భార్య ఊహకి ఈ గొప్ప నటుడికీ ఉన్న చుట్టరికం తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే

అప్పట్లో తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పించిన నటి ఊహ తెలుసు కదా? చేసింది కొన్ని సినిమాలే అయినా చెరగని ముద్ర వేసిన ఈ హీరోయిన్ ని నటుడు శ్రీకాంత్ పెళ్లి చేసుకున్న సంగతి కూడా తెల్సిందే. నిజానికి ఊహ అసలు పేరు శివరంజని. తెలుగులో ఆమె నటించక ముందే తమిళంలో 20 సినిమాల్లో హీరోయిన్ గా వేసి, స్టార్ ఇమేజ్ తెచ్చుకుంది. అయితే శ్రీకాంత్ హీరోగా కాకుండా మిగిలిన క్యారెక్టర్స్ వేసేవాడు. అయితే ఈవీవీ సత్యనారాయణ తీసిన ఆమె చిత్రంలో శివరంజని పేరును ఊహ గా మార్చేసి టాలీవుడ్ లో పరిచయం చేసారు.

ఇక ఈ సినిమాతోనే ఊహ , శ్రీకాంత్ ల ప్రేమకు కారణం అయింది. అలా వీళ్లిద్దరు కల్సి మూడు సినిమాలు చేసారు. ఊహ తొలి, ఆఖరి తెలుగు చిత్రాలు రెండూ శ్రీకాంత్ తోనే కావడం విశేషం. చివరి సినిమా ఆయనగారు లో ద్విపాత్రాభినయం చేసిన ఊహ కు సినీ నేపధ్యం పెద్దగా లేదని అనుకోవడం సహజం.

కానీ సినిమాల్లో పదునైన సంభాణలు రాసిన అభ్యుదయ రచయిత పీఎల్ నారాయణ ఊహకు స్వయానా మేనమామ.నిజానికి మలయాళీ కుటుంబానికి చెందిన పీఎల్ నారాయణ,గుంటూరు జిల్లా బాపట్లలో పుట్టారు. అక్కడ నుంచి ఒంగోలు ప్రజానాట్యమండలి ద్వారా ‘కుక్క’ అనే నాటకం రాసారు. దాంతో టి కృష్ణ బృందంతో పరిచయం కలిగింది.

నెంబర్ వన్,కర్తవ్యం,నేటి భారతం, రేపటి పౌరులు,మయూరి వంటి సినిమాల్లో నారాయణ నటన ఇప్పటికీ కళ్ళముందు కదులుతుంది.
ఇక అర్ధరాత్రి స్వాతంత్య్రం అనే మూవీకి మాటలు రాసిన నారాయణకు టి కృష్ణ సినిమాల్లో కార్మిక నేత,లాయర్,బడిపంతులు,తాగుబోతు,బెగ్గర్,ఇలా ఏదో ఒరకమైన క్యారెక్టర్ ఉండేది.

ఏ పాత్ర వేసినా దానికి జీవం పోయడంలో పీఎల్ నారాయణ దిట్టగా నిలిచారు . ఇలా నారాయణ కుటుంబం నుంచి రావడం వలన సినీ రంగానికి చెందిన వ్యక్తిని పెళ్లాడతానంటే, ఊహకు వెంటనే ఇంట్లో అంగీకారం లభించింది. పెళ్లికాకముందు పెద్ద నటిగా రాణించిన ఊహ పెళ్లయ్యాక కుటుంబానికి అంకితం అయిపొయింది. ఊహ,శ్రీకాంత్ లకు ఓ కొడుకు, ఇద్దరు కుమార్తెలు.

కొడుకు రోషన్ నాగార్జున నిర్మించిన నిర్మలా కాన్వెంట్ అనే ఓ సినిమాలో ఇప్పటికే హీరోగా నటించాడు. కాగా శ్రీకాంత్ తన వ్యాపారాలు చూసుకుంటూ అడపా దడపా సినిమాల్లో చేస్తున్నాడు.