17 సినిమాలు కలిసి నటించిన బాలయ్య,విజయశాంతి సెట్స్ లో బయట అసలు ఎలా ఉండేవారో తెలుసా.
ఇప్పుడంటే ఒకటి,రెండు,మహా అయితే నాలుగైదు సినిమాలు కల్సి నటిస్తే ఆతర్వాత ఆ జంటను చూస్తే బోర్ కొట్టేస్తోంది. అందుకే ఎప్పటికప్పడు కొత్త హీరోయిన్స్ కోసం వెతుకులాట సాగుతూనే ఉంది. ఉత్తరాది నుంచి దిగుమతి కూడా చేసుకుంటున్నారు. అయితే ఒకప్పుడు ఒక జంట 10,15,కాదు 25,30సినిమాలు కూడా కల్సి నటించిన సందర్భాలున్నాయి. అసలు ఆ జంటను చూస్తే చాలు సినిమా హాల్స్ లో ఈలలు మోగేవి. నిజ జీవితంలో కూడా ఈ జంట ఇలాగే ఉంటారేమో అన్నట్లు సినీ జనాలు భావించేవారు.
ఆ కోవలో చూస్తే, నందమూరి బాలకృష్ణ, లేడీ అమితాబ్ విజయశాంతి జంట ఒకటి. వీరిద్దరూ కల్సి దాదాపు 17చిత్రాల్లో నటించారు. ఒకటి రెండు మినహా దాదాపు అన్నీ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. 1984లో మొదలైన ఈ జంట ప్రస్థానం 1993వరకూ సాగింది. కె మురళీమోహనరావు డైరెక్షన్ లో డాక్టర్ డి రామనాయడు నిర్మించిన కథానాయకుడు చిత్రంతో జోడీ కట్టిన ఈ జంట అక్కడ నుంచి హిట్ ఫెయిర్ గా నిలిచారు.
ఆ తర్వాత రాఘవేంద్రరావు దర్శకత్వంలో పట్టాభిషేకం వచ్చింది. అయితే ఇది ప్లాప్ అయింది. అయితే అదే ఏడాది కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ముద్దుల కృష్ణయ్య సూపర్ డూపర్ హిట్ అయింది. ఇక 1986లో దేశోద్ధారకుడు, అపూర్వ సహోదరులు, భార్గవ రాముడు, 1987లో మువ్వ గోపాలుడు, భానుమతి గారి మొగుడు చిత్రాల్లో బాలయ్య , విజయశాంతి కల్సి నటించారు.
ఎన్టీఆర్,చిరంజీవిలతో మాత్రమే చిత్రాలు తీసే, దేవి ఫిలిమ్స్ అధినేత దేవీ వర ప్రసాద్ 1988లో యండమూరి నవల ఆధారంగా వేరే బ్యానర్ లో భలేదొంగ మూవీని బాలయ్య,విజయశాంతి కాంబినేషన్ లో తీశారు. 1989లో ముద్దుల మావయ్య సినిమాలో ఈ జంట నటించగా బ్లాక్ బస్టర్ అయింది. ఇక 1991లో ముద్దుల మేనల్లుడు,లారీ డ్రైవర్ , తల్లిదండ్రులు ఈ మూడు చిత్రాల్లో నటించగా, తల్లిదండ్రులు మూవీ తప్ప మిగిలిన రెండూ హిట్ అయ్యాయి.
ఇక సినిమా వీరిద్దరి కలయికలో వచ్చిన నిప్పురవ్వ ను విజయశాంతి నిర్మించినట్లు టాక్. ఎందుకంటే యువరత్న ఆర్ట్స్ బ్యానర్ తప్ప ప్రొడ్యూసర్ పేరు ఎక్కడా కనిపించదు. ఆ తర్వాత వీరిద్దరూ ఎక్కడ కల్సి నటించలేదు. బయట కూడా కలుసుకోలేదు. ఉమ్మడి ఆంద్ర ప్రదేశ్ లో విజయశాంతి పాలిటిక్స్ లో బిజీగా ఉంటే,ఇప్పడు ఇద్దరూ రాజకీయాల్లో ఉన్నారు. అయినా ఎక్కడ తారసపడలేదు.