Devotional

ఖైరతాబాద్ వినాయకుని విగ్రహానికి ఖర్చు ఎంతో తెలుసా?

వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా ముగిసాయి. వాడవాడలా గణపతి నవరాత్రి మహోత్సవాలు సందడి చేశాయి. ఉత్సవాలు ముగియడంతో నిమజ్జన కార్యక్రమాలు భారీ ఊరేగింపులతో పూర్తిచేశారు. వినాయక చవితికి ఒక్కోచోట రకమైన విగ్రహాలు ఆకర్షణీయంగా తీర్చిదిద్దడం చూసాం. అయితే తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి అనగానే అందరి దృష్టి భాగ్యనగరంలోని ఖైరతాబాద్ మీద పడుతుంది. ఇక్కడ వినాయక విగ్రహం ఏర్పాటు ఒక్కో ఏడాది ఒక్కో విధంగా ఉండడంతో పాటు లడ్డూ పాటకు కూడా ఇక్కడ ఉండే క్రేజ్ మరెక్కడా ఉండదు. ఇక నిమజ్జనం కూడా ఆఖరున ఖైరతాబాద్ వినాయకునితోనే ముగుస్తుంది. అయితే ఇంతటి ప్రసిద్ధి చెందిన ఖైరతాబాద్ వినాయకుణ్ణి తీర్చిదిద్దినందుకు కార్మికులు చాలా శ్రమిస్తారు. ఒక్కసారి వివరాల్లోకి వెళదాం.

ఈ ఏడాది విగ్రహ తయారికి కరపూజ మే 25నిర్వహించి,100రోజుల్లో పూర్తిచేశారు. నరసాపూర్ లో కర్రలు సైజుల వారీగా కొట్టించి,జూన్ 1న విగ్రహ తయారీ ప్రారంభించారు. ఆదిలాబాద్ నుంచి కార్పెంటర్లు, మచిలీపట్నం నుంచి వెల్డర్లు వచ్చి పనులు చేస్తుంటే,క్లే ఆర్టిస్టులు వచ్చి పని మొదలు పెట్టారు. ఇంచుమించు అన్ని ప్రాంతాల నుంచి వర్కర్స్ ని సెలెక్ట్ చేసి ఇందులో నిమగ్నం చేస్తారు. ఈ విధంగా 150మంది కార్యకర్తలు విగ్రహ తయారీలో పాలుపంచుకున్నారు. సెప్టెంబర్ 11నాటికి పూర్తిచేయడంతో మొత్తమ్మీద వంద రోజుల సమయం పట్టింది. అయితే ఏ కార్మికుకుడు కూడా లాభం చూసుకుకోకుండా, దేవుని పనిగా భావించి ఇచ్చింది తీసుకుని సంతృప్తి తో వెళ్లడం మరో విశేషం.

ఖైరతాబాద్ వినాయకుణ్ణి దాదాపు 36ఏళ్ళ నుంచి ఒకే శిల్పి తయారు చేస్తున్నారు. ప్రతియేటా ఒక్కో రీతిన తీర్చిదిద్దే ఈ వినాయకుణ్ణి ఏదో ఆషామాషీగా తయారుచేయరు. ముందుగా డిజైన్ రూపొందించి,పని పూర్తయ్యాక ప్లాస్ట్ ఆఫ్ పారిస్ తో ఫినిషింగ్ టచ్ ఇస్తారు. అన్ని సమయాల్లో ఆ శిల్పి చేయి పడుతుంది. ఈ శిల్పి నేర్పరితనం విగ్రహంలో కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. అంతేకాదు విజయవాడలో 2016లో 63అడుగులు, 2017 లో 72అడుగుల విగ్రహాలను తయారుచేసి, ఈ శిల్పి కీలక పాత్ర పోషించాడు. ఓ ఇరవై ఏళ్ళు చెప్పుల బజార్ వాళ్లకు కూడా తయారుచేసిన, ఎక్కువ సమయం ఖైరతాబాద్ వినాయక విగ్రహానికి పడుతున్నందున ఇక ఎక్కడా ఒప్పుకోవడం లేదని సదరు శిల్పి చెప్పేమాట.