శ్రీవిద్య గుర్తు ఉందా… ఆ రోజుల్లో నిర్మాతలకు చుక్కలు చూపించేది… ఎలాగో చూడండి
ఒక సినిమా తీయాలంటే చాలా ఈజీ అనుకుంటాం. ఎంతమాత్రం కాదు. కోట్లు వెచ్చించి సినిమా తీసే నిర్మాతకు కొందరు నటీనటులు చుక్కలు చూపిస్తుంటారు. అన్నింటినీ తట్టుకుని సినిమా పూర్తిచేస్తే,తీరా అది ప్రేక్షకులకు నచ్చుతుందో లేదో చెప్పలేం. అందుకు నిర్మాత గుండె అన్నివేళలా గుండె గుభేల్ మంటూనే ఉంటుంది. సినిమా హిట్ అయితే అన్ని కష్ఠాలు , ఇబ్బందులు మర్చిపోయి ఎంజాయ్ చేస్తాడు. లేకుంటే చాలా కష్టాలు వెంటాడుతాయి. ఇక కొందరు నటీనటులు ఎలాంటి సౌకర్యాలు కల్పించినా సర్దుకుపోతారు. కొందరైతే,తమకే కాదు, తమతో వచ్చిన కుటుంబ సభ్యులకు కూడా సౌకర్యాలకు డిమాండ్ చేస్తారు.
ముఖ్యంగా హీరోయిన్స్ గొంతెమ్మ కోర్కెలతో ప్రొడ్యూసర్ లకు నరకం చూపిస్తుంటారట. తమ గ్లామర్ కాపాడుకోవడం కోసం ఫ్రెష్ జ్యుస్ కావాలని,ఏసీ ఏర్పాటుచేయాలని, తన తల్లికి బిర్యానీ తీసుకురావాలని ఇలా ముప్పతిప్పలు పెడుతూ ఉంటారట. ఇది ఇప్పటి మాటేకాదు,అప్పట్లో కూడా కొందరి హీరోయిన్స్ ప్రవర్తన ఇదే రీతిలో ఉండేదట.
అందులో ముఖ్యంగా నటి శ్రీవిద్య మొదటి వరుసలో ఉంటారట. తెలుగులోనే కాకుండా దక్షిణాది భాషల్లో అనేక మూవీస్ లో నటించిన ఈమె నిజానికి సినీ కుటుంబం నుంచే వచ్చింది.ప్రముఖ సింగర్ ఎం ఎల్ వసంత కుమారి కూతురే శ్రీవిద్య. ఈమెతో ఓ తెలుగు సినిమా షూటింగ్ తీస్తున్న సమయంలో రాజమండ్రి చేరుకున్న చిత్ర బృందం రాజమండ్రి సమీపంలోని ఓ గ్రామంలో మకాం పెట్టారు. మకాం,భోజనాలు బానే ఉన్నా,స్నానాలకు ఇబ్బంది వచ్చిందట.
చెంతనే గల గోదావరి నీళ్లతో స్నానాలకు ఏర్పాట్లు చేస్తే, ఆసమయంలో వర్షాలు పడడంతో అవి బురదగా, ఎర్రగా ఉన్నాయని శ్రీవిద్య గొడవ పెట్టిందట.నిజానికి ఆ నీళ్ళల్లో యూనిట్ సిబ్బంది కొన్ని అడవి కాయలను అరగదీసి పొడిని కలపడంతో తేటతేరాయట. ఆ నీటిని అందరికీ ఇచ్చేవారట. అయితే శ్రీవిద్య మాత్రం ఒప్పుకోలేదట.
ఇలాంటి నీళ్లతో స్నానం చేస్తే తన గ్లామర్ ఏం కావాలని , పైగా తనకు హెల్త్ ప్రోబ్లం కూడా ఉందని అందుకే ఈ నీళ్లు కుదరవని తెగేసి చెప్పేసిందట. అప్పట్లో బిస్లేరి వాటర్ మార్కెట్ లో కొత్తగా వస్తోంది. తాగడానికి అవే తెచ్చేవారట. అప్పట్లో లీటర్ వాటర్ బాటిల్ ఆరు రూపాయలు ఉండేదట. అయితే బిస్లేరి వాటర్ తోనే స్నానం చేస్తానని, అదే తీసుకు రావాలని శ్రీవిద్య మొండికేసింది.
దీంతో చేసేది లేక రెండు బకెట్ల ను బిస్లేరి వాటర్ తో నింపి ఇవ్వడంతో అప్పుడు స్నానం చేసిందట. ఒక రోజు కాదు, షూటింగ్ జరిగిన అన్ని రోజులు రెండు పూటలా బిస్లేరి వాటర్ తోనే స్నానం. ఇక నిర్మాత లబోదిబో మనడం తప్ప ఏమి చేయగలడు.