నటి శోభన గుర్తు ఉందా….ఎవరు ఊహించని షాకింగ్ నిర్ణయం…ఏమిటో చూడండి
తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో తనకంటూ విలక్షణ గుర్తింపు తెచ్చుకున్న అందాల నటి శోభన విక్రమ్ మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. అక్కినేని వారసుడు నాగార్జున తొలిసినిమా విక్రమ్ తో తెలుగుతెరకు పరిచయం అయిన శోభన నటిగానే కాకుండా క్లాసికల్ డాన్సర్ కూడా కావడంతో దేశవిదేశాల్లో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంది. చెన్నైలో డాన్స్ స్కూల్ నెలకొల్పిన ఈమె ఎందరికో శిక్షణ ఇస్తూ, నాట్యకారులను తీర్చిదిద్దుతోంది. అయితే ఇంతవరకూ ఆమె పెళ్లిపీటలు ఎక్కకుండా ఒంటరిగా ఉండిపోయింది. అయితే తనకన్నా చిన్న వయస్సు వాడు,అప్పటికే పెళ్ళైనప్పటికీ రాహుల్ నెహ్రా అనే వ్యక్తితో ప్రేమాయణం సాగించినట్లు అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఇక ఇప్పుడు విషయం ఏమిటంటే, గ్రామీణ ప్రాంత ప్రజలకు ఇంటర్ నెట్, ఆధునిక సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చేందుకు తెలంగాణా ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న టి ఫైబర్ ప్రాజెక్ట్ కోసం శోభన ఓ ఒప్పందం చేసుకుందట. ఈ ప్రాజెక్ట్ కి జాదూ సంస్థ చేతులు కల్పింది. జాదూ సంస్థకు శోభన సహ వ్యవస్థాపకురాలిగా ఉంది.
ఈ సంస్థ పక్షాన గ్రామీణ ప్రాంతాల్లో 50సీట్స్ కెపాసిటీతో థియేటర్లు నిర్మించి ,అందులోనే చాయ్, టిఫిన్ సెంటర్లు వంటివి ఏర్పాటుచేస్తారు.గ్లోబలైజేషన్ కారణంగా పల్లెల్లో, గ్రామాల్లో థియేటర్లు మూతపడ్డాయి. ఇక టివిల మీదే ఆధారపడుతూ థియేటర్లకు దూరం అయ్యారు. ఈ ప్రాజెక్ట్ లో భాగంగా రంగారెడ్డి జిల్లా తూములూరులో పైలెట్ ప్రాజెక్ట్ గా ప్రారంభించబోతున్నారట.
ఇక్కడ వచ్చే రిజల్ట్స్ ని బట్టి మిగిలిన సెంటర్స్ కి విస్తరిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో సినిమా థియేటర్లు లేని విషయాన్ని గుర్తించి, తెలంగాణా ప్రభుత్వం టి ఫైబర్ పేరిట సేవలు అందించాలని నిర్ణయించింది. జాదూ సంస్థతో అగ్రిమెంట్ చేసుకుంది.
మొదటగా 500 గ్రామాల్లో జాదూ సెంటర్లు ఏర్పాటుచేసి,వర్ట్యువల్ సదుపాయం కల్పిస్తారు. ఈ సెంటర్స్ ద్వారా 700 కోట్లు ఆదాయం వస్తుందని అంచనా. ఆరువేల మందికి ఉపాధి కలుగుతుందట. ఇక జాదూ సంస్థ సిఇఓ ఎవరంటే ఒకప్పుడు శోభన ప్రియునిగా ఉన్న రాహుల్ నెహ్రా. అదండీ మళ్ళీ ఇలా తెరమీదికి శోభన వచ్చారు.