తన ఫోన్ పగిలిపోవటానికి కారణమైన చైల్డ్ ఆర్టిస్ట్… అప్పుడు ప్రభాస్ ఏమి చేసాడో చూడండి
చిత్రసీమలో చాలామంది చైల్డ్ ఆర్టిస్టులు వస్తూంటారు, పోతూంటారు. కొందరు పెద్దయ్యాక కూడా హీరో హీరోయిన్స్ , కమెడియన్స్ గా స్థిరపడతారు. అలా చాలామందే వున్నారు. అయితే దాదాపు 30సినిమాల్లో నటించిన చైల్డ్ ఆర్ట్స్ ప్రేమ్ బాబు కూడా పెద్దయ్యాక పెద్ద స్టార్ అవ్వాలని కోరుకుంటున్నాడు. రచ్చలో చిన్నప్పుడు రామ్ చరణ్,టెంపర్ లో చిన్నప్పటి జూనియర్ ఎన్టీఆర్ గా ఇలా చాలా సినిమాల్లో నటించిన ప్రేమ్ బాబు కి మంచి స్పార్క్ ఉందని, తప్పకుండ పైకి వస్తాడని చెర్రీ, తారక్ లు అభినందించారు. ఇంతపెద్ద డైలాగ్ అయినా సరే సింగిల్ టేక్ లో ఒకే చేయడం ఇతగాడి స్టైల్.
అతని తల్లిదండ్రులకు తిరుమల వెంకటేశ్వర స్వామి సెంటిమెంట్ ఉందట. అందుకే తిరుమల వెళ్ళినప్పుడల్లా పెద్ద హీరో కావాలని కోరుకుంటాడట. ఇక ఈ కుర్రాడికి సినీ కెరీర్ విషయంలో ఓ ఇబ్బంది సంఘటన జరిగిందట. పైగా అది ప్రభాస్ విషయంలో చోటుచేసుకుందట. ప్రభాస్ ని చూడ్డానికి సాహో సెట్స్ కి ప్రేమ్ బాబు వెళ్ళాడట. ప్రభాస్ కి చిన్నపిల్లలను సైతం గౌరవించడం అలవాటు. అదే క్రమంలో అక్కడికి వచ్చిన ప్రేమ్ బాబుని చూసిన ప్రభాస్ అతనికి స్వాగతం పలకడానికి పైకి లేచాడట.
ఆ సమయంలో ప్రభాస్ చేతిలో ఖరీదైన స్మార్ట్ ఫోన్ కిందపడిపోయింది. లక్షల విలువ చేసే ఫోన్ కిందపడి, స్క్రీన్ ముక్కముక్కలై పోవడంతో ప్రేమ్ బాబు అది చూసి షాక్ తిన్నాడు. ప్రభాస్ ఏమంటాడో అనుకుని ప్రేమ్ బాబు వణికిపోయాడట. సారీ అంటూ భయంభయంగా చెప్పడంతో ప్రభాస్ అక్కడేమీ జరగనట్లుగా,ఎం పర్వాలేదు ప్రేమ్, కూల్ కూల్ అంటూ పలకరించి అతిధి మర్యాదలు చేసాడట.
ఇది చూసిన ప్రేమ్ ఇది కలా నిజమా అని నిర్ఘాంత పోయాడట. ఫోన్ పొతే పోయిందిలే ఇంకోటి కొనుకోవచ్చు, ఏం మూవీస్ చేస్తున్నావ్, స్టడీస్ ఎలా ఉన్నాయి ఇలా కుశల ప్రశ్నలతో సంతోషం నింపిన ప్రభాస్ ని తలచుకుని ఎన్నో విషయాలు చెప్పుకొస్తున్నాడు ప్రేమ్ బాబు.