Movies

సాయి కుమార్ ‘తల్లి’ కూడా ఒకప్పటి స్టార్ హీరోయిన్ అని మీకు తెలుసా? ఇంటిలో అందరూ నటులే

పైకి కనిపించే మూడు సింహాలు కాదు కనిపించని నాలుగో సింహమేరా పోలీస్ అంటూ కంచు కంఠం వినబడగానే ఠక్కున గుర్తొచ్చేది నటుడు సాయికుమార్. హీరోగా, క్యేరక్టర్ ఆర్టిస్టుగా, విలన్ గా మరీ ముఖ్యంగా డబ్బింగ్ ఆర్టిస్టుగా, టివి యాంకర్ గా ఇలా అన్నింటా రాణిస్తున్న సాయికుమార్ తండ్రి పిజె శర్మ సినీ రంగంలో అన్ని రకాల పాత్రలతో అలరించి రుబ్బింగ్ ఆర్టిస్టుగా తనదైన ముద్రవేశారు. ఇక ,తమ్ముళ్లు రవిశంకర్, అయ్యప్ప శర్మ నటులుగా,డబ్బింగ్ ఆరిస్టులుగా ఉన్నారు. కొడుకు ఆది కూడా నటుడే. అంతేకాదు సాయికుమార్ తల్లి కూడా ఒకప్పటి స్టార్ హీరోయిన్,డబ్బింగ్ ఆర్టిస్టు కూడా నట. ఇలా ఫ్యామిలీ మొత్తం నటనలో, డబ్బింగ్ కళలో ఆరితేరారు.

సాయికుమార్ కేరక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తూనే గతంలో హీరో సుమన్ కి ఆతర్వాత డాక్టర్ రాజశేఖర్ కి కూడా డబ్బింగ్ చెప్పారు. నిజానికి సాయికుమార్ డబ్బింగ్ చెప్పడం మానేసాకే డాక్టర్ రాజశేఖర్ కెరీర్ కూడా సక్రమంగా సాగలేదని చెప్పాలి. పోలీస్ స్టోరీ సినిమాతో హీరోగా కూడా సాయికుమార్ మంచి పేరు తెచ్చుకున్నాడు.

ఆ తర్వాత కొన్ని సినిమాలు హీరోగా వచ్చినా రాణించకపోవడంతో కేరక్టర్ ఆర్టిస్టుగా,విలన్ గా,డబ్బింగ్ ఆర్టిస్టుగా తన ప్రస్థానం సాగిస్తున్నాడు. సాయికుమార్ తండ్త్రి స్వర్గీయ పిజె శర్మ అప్పటి హీరోలు కృష్ణ,శోభన్ బాబు వంటి హీరోలకు తండ్రిగా ,కొన్ని సినిమాల్లో నెగెటివ్ కేరక్టర్ గల పాత్రలలో నటించి మెప్పించారు. డబ్బింగ్ ఆర్టిస్టుగా పేరుతెచ్చుకున్నారు. ఇక సాయికుమార్ తల్లి విషయం అందరికీ తెలియక పోవచ్చు.

ఆమె పేరు కృష్ణ జ్యోతి. ఈమె అప్పట్లో తెలుగు,కన్నడ , తమిళ సినిమాల్లో స్టార్ హీరోయిన్. అంతేకాదు డబ్బింగ్ ఆర్టిస్టు కూడా. సాయికుమార్ తమ్ముడు రవిశంకర్ పేరు చెప్పగానే ‘వదల బొమ్మాలి’అనే డైలాగ్ గుర్తొస్తుంది. అరుంధతిలో విలన్ పాత్రకు రవిశంకర్ డబ్బింగ్ అదరగొట్టేసింది. మూడువేల సినిమాలకు పైనే తెలుగు,తమిళ,కన్నడ రంగాల్లో డబ్బింగ్ చెప్పాడు.

యితడు కన్నడంలో కూడా స్టార్ విలన్. కన్నడలో ఇతను నటించిన కెంపె గౌడ సినిమాలో విలన్ పాత్ర కెరీర్ ని మార్చేసింది. కెంపె గౌడ రవి అనే పేరుతొ ఇతన్ని అక్కడ పిలుస్తారు.

సాయికుమార్ మరోతమ్ముడు అయ్యప్ప శర్మ కన్నడలో నటుడే. నిజానికి సాయికుమార్ కూడా కన్నడలో నటుడే. ఇక సాయికుమార్ తనయుడు ఆది తెలుగులో హీరోగా ఎంట్రీ ఇచ్చి తొలిసినిమాతో మంచి పేరు తెచ్చుకున్నా,బ్యాక్ గ్రౌండ్ ఉన్నా సరే ఎందుకో నిలదొక్కుకోలేక పోయాడు. మొత్తం మీదా కుటుంబం అంతా కళామతల్లి సేవలో తరిస్తోంది.