దసరా నవరాత్రులలో ఎనిమిదో రోజు అలంకరణ… నైవేద్యం ఏమిటో తెలుసా?
ఎనిమిదో రోజు – మహిషాసుర మర్ధిని అలంకారం
ఇది అమ్మవారి అతి ఉగ్రమైన రూపం. అశ్వయుజ శుద్ధ నవమి నాడు అమ్మవారు మహిషాసురమర్ధినిగా అవతరించి, దుష్ట శిక్షణ, శిష్టరక్షణ చేసింది. ధర్మ విజయానికి సంకేతంగా అశ్వయుజ శుద్ధనవమినే ”మహార్నవమి”గా భక్తులు ఉత్సవం జరుపుకొంటారు. సింహవాహనాన్ని అధిష్టించి ఆయుధాలను ధరించి , అమ్మ సకల దేవతల అంశలతో మహా శక్తిగాఈ రొజు దర్శనం ఇస్తుంది. మహిషాసురుడనే రాక్షసుడిను వధించిన అమ్మను ఈ రోజున పూజిస్తే శత్రుభయం తొలగి సకల విజయాలు కలుగుతాయి. ఈ అమ్మను పూజిస్తే సకలదేవతలను పూజించిన ఫలితం దక్కుతుంది. పూజానంతరం అన్నం పరమాన్నం, గారెలు, వడపప్పు, పానకం నైవేద్యంగా పెట్టాలి.