Politics

బాలయ్య చిన్న కూతురు ఇంటిలో తీవ్ర విషాదం… షాక్ లో చంద్రబాబు

అధినేత, టీడీపీ నాయకుడు ఎంవీవీఎస్ మూర్తి మనవడు భరత్ తో జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఎంవీవీఎస్ మూర్తి అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. గీతం పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొనేందుకు ఆయన కొన్నిరోజుల క్రితం అమెరికా వెళ్లారు. అక్కడ ఎంతో ప్రసిద్ధిచెందిన వైల్డ్ లైఫ్ సఫారీ చూసేందుకు వెళుతూ అలస్కాలోని ఆంకరేజ్ సిటీ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. యాక్సిడెంట్ జరిగిన సమయంలో ఎంవీవీఎస్ మూర్తితోపాటు కారులో మరో నలుగురు కూడా ఉన్నారు. అందులో ఒకరు ప్రాణాలతో బయటపడ్డారు. మూర్తితోపాటు మృతి చెందినవారిని వెలువోలు బసవపున్నయ్య, వీరమాచినేని శివప్రసాద్, వీబీఆర్ చౌదరిగా గుర్తించారు.
geetham university director mvvs murthy
ఎంవీవీఎస్ మూర్తి పూర్తి పేరు మతుకుమిల్లి వీర వెంకట సత్యనారాయణమూర్తి. ఆయన స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా అయినవల్లి మండలం మూలపాలెం. ఆయన విద్యాభ్యాసం కాకినాడలో సాగింది. తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ విద్యావేత్తగా పేరుగాంచారు. గీతం విద్యాసంస్థలు స్థాపించి తెలుగు ఖ్యాతిని ఇనుమడింపజేశారు. రాజకీయాల్లోకి ప్రవేశించి ఎంపీగా, ఎమ్మెల్సీగా సేవలందించారు. ఆయన మృతిపట్ల సీఎం చంద్రబాబునాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

టీడీపీ నేతలందరూ రోడ్డు ప్రమాదాల్లోనే మరణిస్తుండడం తనను కలచివేసిందని చంద్రబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇక బాలయ్య ఇంట్లో కూడా విషాద ఛాయలు అలముకున్నాయి. బాలయ్య చిన్న కుమార్తెను ఎంవీవీఎస్ మూర్తి మనవడైన భరత్ కు ఇచ్చి పెళ్లి చేసిన సంగతి తెలిసిందే. తమ కుటుంబ పెద్ద మూర్తి గారి మరణంతో తేజస్విని తీవ్ర విషాదానికి గురైంది. వచ్చే ఎన్నికల్లో తేజస్విని భర్త భరత్ విశాఖపట్నం ఎంపీగా పోటీచేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. తాతగారైన మూర్తి వృద్ధాప్యంలోకి అడుగుపెట్టడంతో ఆయన వారసుడిగా ఎదగాలని భరత్ భావించాడు. అయితే ఆయన మరణంతో భరత్ రాజకీయ ప్రవేశం ఏ మలుపు తిరుగుతుందోనన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.