Movies

ఈ క్యారెక్టర్ ఆరిస్టుల భర్తలు ఎవరు…. ఏమి చేస్తున్నారో తెలుసా?

సినిమాకు హీరో హీరోయిన్స్ ఎంత ముఖ్యమో విలన్,కమెడియన్స్,సపోర్టింగ్ ఆర్టిస్ట్స్ ఇలా అందరూ కూడా ముఖ్యమే. ఇక సపోర్టింగ్ ఆర్టిస్ట్స్ ఒక్కోసారి కీ రోల్ అవుతారు. వాళ్ళ ఇమేజ్ అలాంటిది. తల్లి,అక్క, భార్య,వదిన,మరదలు,అత్తా,ఇలా అన్ని పాత్రలు ఉండేది కొద్దిసేపే కావచ్చు ఫ్రేమ్ లో వాళ్ళే కీలకం. ఇక హీరో హీరోయిన్స్ అయితే రెండు మూడు సినిమాలు మించి వుండవు. సపోర్టింగ్ ఆర్టిస్టులు అయితే డజన్ల కొద్దీ సినిమాల్లో చేయడం వలన వీళ్ళ కాల్ షీట్స్ దొరకడం కూడా గగనం అన్నట్లు ఉంటుంది. సపోర్టింగ్ ఆర్టిస్టుల్లో పవిత్ర లోకేష్, ప్రగతి, హేమ,సురేఖావాణి ల రేంజ్ వేరు. వీళ్ళ వయస్సు పెద్దగా లేకున్నా సపోర్టింగ్ రోల్స్ తో యూత్ ని కూడా అలరిస్తున్నారు.

ఇక కేరక్టర్ ఆర్టిస్టుల్లో సీనియర్ అయిన హేమ అసలు పేరు కృష్ణవేణి ప్రయివేట్ గా డిగ్రీ కంప్లిట్ చేసింది. కోనసీమ ప్రాంతానికి చెందిన ఈమె సినిమాలంటే పిచ్చ అభిమానంతో వెండితెరపై మెరిసింది. మొదట్లో హీరోయిన్ ఫ్రెండ్ కేరక్టర్స్ వేసిన ఈమె మద్రాసులో శిక్షణ తీసుకుని కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా వేసినా రాణించలేదు. సుహాసిని, రాధిక,సుమలత,విజయశాంతి ,రాధ వంటి హీరోయిన్స్ ముందు నిలదొక్కుకోలేక,కేరక్టర్ రోల్స్ కి షిఫ్ట్ అయింది. ప్రముఖ కెమెరామెన్ ఎస్ డి లాల్ కొడుకు సయ్యద్ జాన్ అహ్మద్ ని ప్రేమించి పెళ్లిచేసుకున్న ఈమెకు ఈశా అనే కూతురుంది. త్వరలో హీరోయిన్ గా రంగప్రవేశం చేయించాలని ఉవ్విళూరుతోంది.

కాగా ప్రగతి గురించి వివరాల్లోకి వెళ్తే, ఈమె చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయింది. తల్లికి ఆసరాగా ఉండడానికి టెలిఫోన్ బూత్ లో పనిచేసిన ఈమె కాలేజ్ డేస్ లో మైసూర్ సోప్స్ మోడలింగ్ చేసి,ఆతర్వాత సినిమాల్లో ఎంట్రీ ఇచ్చింది. నువ్వులేక నేను లేను,కందిరీగ,దూకుడు , ఢమరుకం బద్రీనాధ్ , రేసుగుర్రం వంటి మూవీస్ ప్రగతికి పేరుతెచ్చాయి. తమిళంలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈమె చిన్నవయస్సులోనే పెళ్లి పీటలు ఎక్కింది. ఆమె భర్త కస్టమ్స్ అధికారి. వీళ్ళకి ఇద్దరు పిల్లలు. ఇక భర్తతో విభేదాలు రావడంతో పిల్లలతో కల్సి ప్రగతి విడిగా ఉంటోందని అంటున్నారు.

హీరోయిన్స్ కి ధీటుగా వుండే సురేఖావాణి కేరక్టర్ ఆర్టిస్టుగా దూసుకెళ్లింది. ఈమెది విజయవాడ. తండ్రి ఓ బిజినెస్ మ్యాన్. బాల్యంలో ఎక్కువ కల్చరల్ ఏక్టివిటీస్ లో పాల్గొనే సురేఖా 8వ తరగతిలోనే చిల్డ్రన్స్ ప్రోగ్రాం కి యాంకర్ గా చేసి అదరగొట్టింది. సినిమాల్లోకి వచ్చాక చిన్నచిన్న రోల్స్ వేస్తూ,కేరక్టర్ ఆర్టిస్టుగా నిలదొక్కుకుంది. భద్ర ,దుబాయ్ శీను,ఏం మాయ చేసావే,లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్,నాయక్,బాద్షా ,శ్రీమంతుడు లాంటి మూవీస్ ఈమెకు మంచి బ్రేక్ ఇచ్చాయి.

ఈమె చిన్నవయస్సులోనే పెళ్లి చేసుకుని సెటిల్ అయింది. లోకల్ టివిలో పనిచేసేటప్పడు ప్రోగ్రాం ప్రొడ్యూసర్ సురేష్ తేజాతో ప్రేమలో పడి, పెళ్లిచేసుకుంది. మొదట్లో వీళ్ళ ఫామిలీ మెంబర్స్ పెళ్ళికి నో చెప్పినా,ఆతర్వాత పచ్చజెండా ఊపారు. సురేఖకు 17ఏళ్ళ కూతురు ఉంది. కొన్నాళ్ల క్రితం కూతురుతో కల్సి సురేఖ చేసిన డాన్స్ హల్ చల్ చేసింది.

పవిత్ర లోకేష్ వివరాల్లోకి వెళ్తే, కుటుంబ పరిస్థితుల కారణంగా 16ఏళ్ళ ప్రాయంలోనే సినిమాల్లో చేరింది. మైసూరు కు చెందిన పవిత్ర తండ్రి పేరు లోకేష్ కూడా యాక్టరే. తెలుగు అమ్మాయి కానప్పటికీ టాలీవుడ్ లో తల్లి పాత్రలకు కేరాఫ్ ఎడ్రెస్ అయింది. నెంబర్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా పేరుతెచ్చుకుంది. తండ్రి మరణంతో కుటుంబ పోషణకు సినీమాల్లో చేరిన ఈమె దాదాపు అన్ని రకాల కేరక్టర్ రోల్స్ తో 200సినిమాల్లో నటించి మెప్పించింది. ఇప్పటి తరం హీరోలకు తల్లి పాత్రలకు ఎవరు సూటవుతారో అని వెతుకుతుంటే, పవిత్ర ను చూసి ఫిలిం మేకర్స్ ఫిక్స్ అయ్యారు.

ఇక ఎవరు ఎలాంటి వారో తెలియని పరిస్థితుల్లో ఇండస్ట్రీలోనే కళ్ళముందు కదలాడే వ్యక్తి మిన్న అని భావించి, తన సహనటుడు సుచేంద్ర ప్రసాద్ ని వివాహమాడింది. నిజానికి అతనికి ఇది రెండో పెళ్లి. మొదటి భార్య మల్లికా ప్రసాద్. ఈమెతో పవిత్రకు అంతకుముందే ఫ్రెండ్ షిప్ వుంది. ఇద్దరూ కల్సి గుప్తగామిని సీరియల్ లో అక్కాచెల్లెళ్లుగా నటించారు. అందులో ఇద్దరూ కల్సి ఒకే వ్యక్తిని పెళ్లాడతారు. ఆ సీరియల్ కన్నడంలో వెయ్యి ఎపిసోడ్స్ లో నడిచింది. మొత్తానికి యాదృచ్ఛికమో ఏమో గానీ నిజజీవితంలో కూడా వీరిద్దరూ ఒకరినే పెళ్లాడారు.