Y.S.షర్మిల కొడుకు,కూతురు ఇప్పుడు ఏమి చేస్తున్నారో తెలుసా?
అభివృద్ధి , సంక్షేమ కార్యక్రమాలతో తెలుగు ప్రజలు గుండెల్లో చెరగని ముద్రవేసుకున్న నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. ప్రతి కుటుంబానికి సంక్షేమ ఏదోఒక సంక్షేమ పధకం ఫలాలు అందేలా చేసిన డాక్టర్ వైఎస్ మరణం తీరనిలోటు. ఇప్పటికీ డాక్టర్ వైఎస్ ని స్మరించేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక వైఎస్ మరణంతో ఆయన కుమారుడు జగన్ కాంగ్రెస్ కి రాజీనామా చేసి తండ్రి పేరిట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెట్టాడు. ప్రస్తుతం పాదయాత్ర ద్వారా ఉత్తరాంధ్ర చేరుకున్నాడు. జగన్ కోసం తల్లి వైఎస్ విజయమ్మ,సోదరి షర్మిలారెడ్డి కూడా ప్రచారంలో పాల్గొన్నారు. సోదరుడు అంటే పంచప్రాణాలుగా భావించే షర్మిల అన్నకోసం జగనన్న వదిలిన బాణం అంటూ పాదయాత్ర చేసింది. ఇక తల్లి విజయమ్మ కూడా ఎప్పుడంటే అప్పుడు కొడుకు కి అండగా ఉంటోంది.
మొన్నటి ఎన్నికల్లో జగన్ పార్టీ అధికారంలోకి రాకపోవడంతో షర్మిల,విజయమ్మ రాజకీయాలకు కొంతదూరంగా ఉంటున్నా, వీలున్నప్పుడు జగన్ కోసం వస్తూనే వున్నారు. ఇక షర్మిలా రెడ్డి విషయం తీసుకుంటే,ఆమెకు ఓ కుమారుడు,ఓ కూతురు వున్నారు. రాయలసీమ పౌరుషానికి ప్రతీక అయిన తన తాత రాజారెడ్డి పేరును కొడుక్కి పెట్టుకుంది షర్మిలారెడ్డి. అయితే రాయలసీమ ఫ్యాక్షన్ ప్రభావం అతడిపై పడకూడదన్న ఉద్దేశ్యంతో విదేశాల్లో చదివిస్తోంది. షర్మిల నిజానికి తన బంధువైన చంద్ర ప్రతాప రెడ్డిని పెళ్లి చేసుకున్నప్పటికీ, అతనితో కొంతకాలానికే విభేదాలు వచ్చాయి.
ఇక యోగి చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన చంద్రప్రతాప్ రెడ్డి, అనుకుకోండా రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఆయన మరణం పలు సందేహాలకు తావిచ్చిందని అంటారు. ఇక ఆతర్వాత అనిల్ కుమార్ ని పెళ్లాడింది. అయితే ఇద్దరికీ రెండో పెళ్లి కావడం విశేషం.
షర్మిలకు క్టైస్తవం స్వీకరించిన అనిల్ ఆ తర్వాత బ్రదర్ అనిల్ అయ్యాడు.
క్రైస్తవ మత ప్రచారకునిగా దేశవిదేశాల్లో తిరుగుతూ ఉంటాడు. ఆసమయంలో కొడుకు రాజారెడ్డిని చూసి వస్తుంటాడు. ఇక ఏడాది ఒక్కసారి మాత్రమే ఇండియాకు వచ్చే రాజారెడ్డి, తండ్రి బాటలోనే క్రిస్టియన్ మత బోధకునిగా అవతారం ఎత్తే ఛాన్స్ కనిపిస్తోంది. ఎందుకంటే అక్కడ క్రైస్తవ మత బోధకునిగా తయారవ్వడానికి శిక్షణ కూడా తీసుకుంటున్నాడట.
యితడు చెప్పే బోధనలు చూసి ఇంటర్నేషనల్ సువార్తికులు కూడా ఆశ్చర్యపోతున్నారట. కాగా షర్మిల కుమార్తె అంజలీ రెడ్డి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చేయాలని నిర్ణయించుకుందట. మేనమామ జగన్,అత్త భారతీల వ్యాపార రంగంలో ప్రవేశించి రాణించాలన్నది ఆమె కోరికట.