Movies

అల్లు అర్జున్ ,త్రివిక్రమ్ ఒకేసారి ఆఫీస్ లు మార్చేశారు… అదృష్టం కలిసి వస్తుందా?

సెంటిమెంట్ అనేది చాలామందికి ఉంటుంది. ఇక సినిమా రంగంలో అయితే చెప్పక్కర్లేదు. ఇంతపెద్ద స్టార్ అయినా, దర్శకుడైనా సరే, హిట్ కొట్టినప్పుడు క్యూ కట్టడం,ప్లాప్ అయితే పత్తాలేకుండా పోవడం కనిపిస్తుంది. బహుశా ఇప్పుడు ఇద్దరి వ్యవహారం అలానే ఉంది. అందులో ఒకరు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్,రెండు వ్యక్తి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. నిజానికి వీళ్లిద్దరి మధ్యా ఓ సినిమా మూవ్ కావాల్సి ఉంది. అయితే అజ్ఞాత వాసి ప్లాప్ అవ్వడంతో త్రివిక్రమ్ శ్రీనివాస్ పునరాలోచనలో పడ్డాడు. అలాగే నాపేరు సూర్య ఘోర పరాజయంతో బన్నీ షాక్ లోకి వెళ్ళాడు. దీంతో వీరిద్దరి భవిష్యత్ సినిమాలే వీరిని మళ్ళీ నిలబెట్టాలి. అందుకే ఇద్దరూ కూడా సెంటిమెంట్ గా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారని అనిపిస్తోంది.

త్రివిక్రమ్ అజ్ఞాత వాసి తర్వాత చేస్తున్న సినిమా ‘అరవింద సమేత ..’ పైగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో తొలిసారి కల్సి చేస్తున్న మూవీ. అందుకే పక్క జాగ్రత్తలు తీసుకున్నాడట త్రివిక్రమ్. గతంలో అజ్ఞాత వాసి కార్యకలాపాలు సాగించిన ఆఫీసు నుంచి కాకుండా బంజారా హిల్స్ లో కళ్యాణ్ రామ్ ఆఫీసుకు దగ్గరలో ‘అరవింద సమేత ..’ కోసం ఓ కొత్త ఆఫీసు తీసుకుని అక్కడి నుంచే ఆపరేట్ చేస్తున్నాడట. దాంతో ఈ మూవీ బిజినెస్ కూడా బాగానే సాగిందని టాక్.

ఇక అల్లు అర్జున్ అయితే గతంలో తనతండ్రి గీతా ఆఫిసులో కార్యక్రమాలు చేస్తుండేవాడు. నాపేరు సూర్య పరాజయం కావడంతో తన కార్యస్థానాన్ని తాను విలాసవంతంగా నిర్మించుకున్న ఏ ఏ కు సంబంధించిన రెండంతస్తుల ఆఫీసుకి మార్చేశాడు. ఇప్పుడు ఎవరు కథలు చెప్పినా అక్కడే వింటున్నాడు. దర్శకుడు విక్రమ్ కుమార్ ఇప్పటికే బన్నీకి చెప్పిన కథకు మార్పులు చేర్పులు చేసి ఒకే చేయించినట్లు వార్తలొస్తున్నాయి. ఇక ‘అరవింద సమేత ..’బ్లాక్ బస్టర్ అయితే త్రివిక్రమ్ తో చేయి కలపాలని బన్నీ భావిస్తున్నాడట.
Allu arjun New banner
అందుకే ‘అరవింద సమేత ..’సక్సెస్ కోసం బన్నీ ఆసక్తిగానే ఉన్నాడు. అరవింద సమేత హిట్ అయితే త్రివిక్రమ్ తో ఒకవేళ ఈ మూవీ అనుకున్న రేంజ్ కి వెళ్లలేకపోతే,విక్రమ్ కుమార్ తో కమిట్ అవ్వాలని బన్నీ భావిస్తున్నాడట. మొత్తానికి అటు త్రివిక్రమ్ కి , ఇటు బన్నీకి కూడా అరవింద సమేత మూవీయే కీలకం అయింది.