అరవింద సమేతపై కత్తి మహేష్ షాకింగ్ రివ్యూ…ఎన్టీఆర్ ఫాన్స్ రియాక్షన్ ఎలా ఉంటుందో?
యంగ్ టైగర్ ఎన్టీఆర్,పూజ హెడ్గే హీరో హీరోయిన్స్ గా నటించిన సినిమా అరవింద సమేత వీర రాఘవ. అరవింద సమేత టైటిల్ కాగా,వీర రాఘవ అనేది క్యాప్షన్. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ సినిమా విడుదలకు ముందే ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన హైప్ వచ్చింది. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల చేసారు. అమెరికాలో ఒక్క రోజు ముందు ప్రీమియర్స్ పడటంతో టాక్ ముందుగానే వచ్చేసింది. సూపర్ హిట్ అనే మాట వినిపిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో సైతం అదే మాట వినిపిస్తుంది. తెల్లవారుజామున నుంచే తెలుగు రాష్ట్రాల్లో షోలు ప్రారంభం అయ్యాయి. ప్రఖ్యాత సినీ క్రిటిక్ కత్తి మహేష్ అరవింద సమేత సినిమాకి తనదైన శైలిలో రివ్యూ ఇచ్చారు.
రాయలసీమ పౌరుషంపై ఇప్పటివరకు చాలా సినిమాలను చూసాను. ఆ సినిమాల్లో ఇంప్రెస్ చేసే పాయింట్ ఏది కనిపించలేదు. ఆ లోటు అరవింద సమేతతో తీరిపోయింది. ఎంతసేపు హీరో,విలన్స్ గురించేనా…. సీమలో తల్లులు, భార్యలు,అక్కలు,చెల్లెల్లు,కూతుళ్లు ఉంటారని వారికీ బాధలు ఉంటాయని చూపించిన మొదటి సినిమా అరవింద సమేత.
ఈ సినిమా తీసిన త్రివిక్రమ్ కి హ్యాట్సాఫ్ చెప్పాలి. సీమలో మగవారి పౌరుషాన్ని మాత్రమే చూపే సమాజంలో ఆడవారి కోణంలో ఒక సినిమా తీయటం అనేది మాములు విషయం కాదు. యుద్ధం చేయటం గొప్ప కాదు. ఆ తర్వాత పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో చూపించిన సినిమా. ఎన్టీఆర్ నటన విషయానికి వస్తే సినిమా సినిమాకి ఎన్టీఆర్ తన నట విశ్వరూపాన్ని చూపిస్తున్నాడు.
పూజ హెడ్గే ఈ సినిమా ద్వారా మరోసారి గ్లామర్ క్వీన్ అనిపించుకుంటుంది. ఓబోలేసు పాత్రలో జగపతి బాబు ఓ రేంజ్ లో నటించాడు. హీరో నుంచి కమెడియన్ గా మారిన సునీల్ నీలాంబరి పాత్రను వేసాడు. సునీల్ నవ్వులే కాదు ఎమోషన్ కూడా బాగా పండిస్తాడని మరోసారి నిరూపించాడు. తమన్ సినిమాకి ఊపిరి పోసాడు. ఫ్యాక్షన్ సినిమాల్లో అరవింద సమేత సరికొత్త ట్రెండ్ ని సృష్టిస్తుంది.