Movies

వణికిస్తున్న అరవింద సమేత ప్రీమియర్ షో కలెక్షన్స్

త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కామిబినేషన్ లో వచ్చిన అరవింద సమేత వీర రాఘవ మూవీకి మంచి టాక్ వచ్చిందని తెలుస్తోంది. ఎపి ప్రభుత్వం బెన్ ఫిట్ షోలకు కూడా అనుమతి ఇవ్వడంతో పలుచోట్ల స్పెషల్ షోలు వేశారు. వరల్డ్ వైడ్ గా ఈ సినిమా ఈరోజు విడుదల కావడంతో వసూళ్ల వర్షం వచ్చిపడిందని అంటున్నారు. ఇక ఈ దసరాకి పెద్ద సినిమాలేవీ లేకపోవడంతో, ఇటీవల వచ్చిన విజయ్ దేవరకొండ ‘నోటా ‘మూవీ ప్లాప్ టాక్ తెచ్చుకోవడం నేపథ్యంలో ఇక ఈ దసరా పండుగ తారక్ దేనని అంటున్నారు.

నిజానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ చాలా ఆలోచించి తీస్తాడు. డైలాగ్స్ కూడా పేలతాయి. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఆ మధ్య వచ్చిన అజ్ఞాత వాసి మూవీ ఘోరంగా ఫెయిల్ అవ్వడంతో అసలు ఈ సినిమా త్రివిక్రమ్ తీసాడా వేరెవరైనా తీసారా అని జనం అనుకోవడం కూడా జరిగింది. అందుకే ఎన్టీఆర్ కాంబో లో తొలిసారి తీస్తున్న అరవింద సమేత వీర రాఘవ మూవీకోసం త్రివిక్రమ్ చాలా జాగ్రత్తలు తీసుకున్నాడట.

ఎక్కడా లోటు లేకుండా పక్కా ప్లాన్ చేసుకుని అందుకనుగుణంగా చిత్రాన్ని తెరకెక్కించాడట. అందుకే మంచి టాక్ తెచ్చుకుందని అంటున్నారు.
ఇక ఓవర్సీస్ నుంచి వస్తున్న రిపోర్ట్స్ ద్వారా ఓ విషయం తెలుస్తోంది. ప్రీ రిలీజ్ కి ముందే అద్భుత రికార్డులను కొల్లగొట్టిందని,ఊహలకు మించిన కలెక్షన్స్ వచ్చాయని అంటున్నారు.

అమెరికాలో మొత్తం 39లొకేషన్స్ లో లక్షా 10వేల డాలర్స్ వసూలైనట్లు చెబుతున్నారు. అంతేకాదండోయ్ హాలీవుడ్ కలెక్షన్స్ కి మించి వసూళ్లు వున్నాయట. హిట్ టాక్ వచ్చిందంటే, ఇక ఎన్టీఆర్ ని హారిక,హాసిని,వాళ్ళని ఆపే విఆర్ లేరట. ఈ సంస్థకు కాసుల వర్షం కురవడం ఖాయమని అంటున్నారు.