Movies

కౌశల్ ఆర్మీ పై తేజస్వి సీరియస్ ….లీగల్ నోటిస్…. కౌశల్ ఆర్మీని తట్టుకొనే శక్తి తేజస్వికి ఉందా?

బిగ్ బాస్ సీజన్ టు రియాల్టీ షో ముగిసి రెండు వారాలు అవుతోంది. దీని స్థానంలో పెళ్లిచూపులు షో కూడా స్టార్ట్ అయింది. ఇక అసలు సంగతి ఏమిటంటే బిగ్ బాస్ హౌస్ లు ఉన్నప్పుడు బయట కూడా కౌశల్ పై తేజస్వి విరుచుకు పడడం చూసాం. రోజులు గడుస్తున్నా సరే , బిగ్ బాస్ షో నాటి సెగలు పొగలు కక్కుతున్నట్టే వుంది. కౌశల్ బిగ్ బాస్ విన్నర్ గా నిల్చి టైటిల్ కొట్టినప్పటికీ,హౌస్ లో నేనే అందరి మనసులను గెలిచానని,నిజమైన గెలుపు తనదేనని తేజస్వి సోషల్ మీడియాలో చెప్పుకొస్తోంది. దీనిపై కౌశల్ ఆర్మీ కౌంటర్ ఇస్తూనే ఉంది. నిజానికి హౌస్ కొనసాగుతున్నప్పుడు తేజస్వి చేసే వ్యాఖ్యలు,అనుసరించే తీరుపై కౌశల్ ఆర్మీ మండిపడేది. అది బిగ్ బాస్ ముగిసినా ఆగలేదు.

అంతేకాదు స్వయంగా కౌశల్ లైన్ లోకి వచ్చి తేజస్విపై ట్రోల్స్ ఆపేయమని చెప్పినా సరే, ఆగడం లేదు. ప్రస్తుతం స్టార్ మాలో లాఫర్ ఛాలెంజ్ ప్రోగ్రాం కి తేజస్వి యాంకర్ గా చేస్తుంటే,ఆమె యాంకరింగ్ భరించలేకపోతున్నాం ఇక ఆపేయండి అంటూ చాలామంది సోషల్ మీడియాలో చాలామంది పోస్టులు పెడుతున్నారు. ఇవి ఓ రకంగా శృతి మించుతున్నాయి.

దీంతో తేజస్వి తాజాగా ఓ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తనను షోషల్ మీడియాలో ట్రోల్స్ వేసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని భావిస్తోందట. సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించబోతున్నట్లు వినికిడి.’సోషల్ మీడియాలో నా గురించి తీవ్రంగా పోస్టులు పెడుతున్నారు. దీనివలన నా కెరీర్ కి తీరని విఘాతం కలుగుతోంది. అందుకే సైబర్ నేరం కింద కేసు పెట్టాలని,లీగల్ గా ప్రొసీడ్ అవ్వాలని అనుకుంటున్నా’అని సన్నిహితుల దగ్గర తేజస్వి అన్నట్లు భోగట్టా.

అయితే కౌశల్ ఆర్మీ అని కాకుండా చాలామంది వ్యక్తిగతంగా ట్రోల్స్ వేస్తుంటే కేవలం కౌశల్ ఆర్మీని ఎలా టార్గెట్ చేస్తూ,కేసు పెడతారని,అసలు ఇలాంటి కేసులు నిలుస్తాయా అని కొందరి వాదన. ఇప్పటికే సోషల్ మీడియా నియంత్రణ తగదని వాదనలు వినిపిస్తుంటే, ఇలాంటి ఫిర్యాదులను అసలు పట్టించుకుంటారా అనే అనుమానం వస్తోంది. చూద్దాం ఏమవుతుందో.