ఢీ జోడి కి రీ ఎంట్రీ ఇస్తున్న రేష్మి….భానుశ్రీ అవుట్… కారణాలు ఏమిటో?
బిగ్ బాస్ సీజన్ టు నుంచి ఎలిమినేట్ అయ్యాక అనూహ్యంగా భానుశ్రీకి ఈటివి ఢీ జోడిలో ఛాన్స్ వచ్చింది. అయితే ఆమెను తొలిగించి మళ్ళీ రేష్మి ఛాన్స్ ఇచ్చేయాలని చాలామంది పోరు పెడుతున్నారట. నిజానికి కొన్ని పనుల వలన కొన్నాళ్లపాటు షో కి దూరంగా ఉండాలని రేష్మి నిర్ణయించు కోవడంతో ఆమె స్థానంలో భానుశ్రీని పెట్టారు. భాను కూడా బానే చేసున్నప్పటికీ,సుడిగాలి సుధీర్ పక్కన ఈమెను చూడలేక పోతున్నామని, అందుచేత ఆమెని తొలగించి,మళ్ళీ రేష్మీ ని తీసుకోవాలన్న నిర్ణయానికి వచ్చారట.
ఢీ10వ సీజన్ పూర్తికావడంతో ఢీ జోడి పేరిట ఈటీవీలో 11వ సీజన్ స్టార్ట్ చేసారు. అప్పటిదాకా సుధీర్ హోస్ట్ గా ఉంటె,లేడీ హోస్ట్ గా రేష్మి ఉండేది. అయితే 11వ సీజన్ లో రేష్మి స్థానంలో భాను చేరింది. బిగ్ బాస్ ద్వారా బాగా ఫేమస్ అయిన భాను రాకతో షోలో కొత్త ఉత్సాహం నెలకొంది. సుధీర్ , భాను ల యాంకరింగ్ తో షో దూసుకుపోతోంది. అయితే మరికొన్ని రోజుల్లో భానుని తప్పించేయనున్నట్లు వార్తలు గుప్పు మంటున్నాయి.
ఇదేదో పుకారు అనుకుంటే, దీనికి సంబంధించిన ఓ ఫోటో వైరల్ అయింది. నిజానికి సుధీర్ ,భాను జోడీ బాగుందని నెటిజన్లు ,ఆడియన్స్ చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే భాను కన్నా సుధీర్ పక్కన రేష్మి అయితేనే భేషుగ్గా ఉంటుందని కామెంట్స్ పెట్టడం కొత్త వివాదానికి దారితీసింది. అందుకే షో నిర్వాహకులు కూడా మళ్ళీ రేష్మినే తీసుకుంటే మంచిదన్న యోచన చేస్తున్నారట.
కొన్నాళ్ళు రెస్ట్ కోసం పక్కకు తప్పుకున్న రేష్మి స్థానంలో వెతికి వెతికి భాను ని తీసుకొస్తే,ఆడియన్స్ మళ్ళీ రేష్మి నే చేర్చుకోవాలని అనడం సంచలనం సృష్టించింది. ఇక దీనికి సంబంధించి కొన్ని ఫోటోలు కూడా వైరల్ అవ్వడంతో రేష్మి మళ్ళీ అడుగుపెట్టడం ఖాయమనే మాటలు వస్తున్నాయి. అయితే ప్రస్తుతం హల్ చల్ చేస్తున్న ఫోటోలను బట్టి, బాగా గమనిస్తే, కొన్ని వారాల తర్వాత గానీ భానుని తప్పించక పోవచ్చని అంటున్నారు. అసలు భానుని తొలగిస్తారా లేదన్నది మరో రెండు మూడు వారాల్లో తేలనుంది.