Movies

బాహుబలి సృష్టికర్త జక్కన్న విజయాల వెనుక అసలు రహస్యం… ఎవరు ఉన్నారో తెలుసా?

తెలుగు చిత్ర సీమలో వరుస విజయాలతో బ్లాక్ బస్టర్స్ అందుకున్న దర్శకులు చాలా అరుదుగా ఉంటారు. ఎందుకంటే,ఓ సినిమా ఆడుతుంది,మరో సినిమా ఆడకపోవచ్చు. కానీ ఎవరితో తీసినా,ఏ సినిమా తీసినా బ్లాక్ బస్టర్ కి చిరునామా అవ్వడం చాలా కష్టం. కానీ ఎస్ ఎస్ రాజమౌళి అది సాధించాడు. స్టూడెంట్ నెంబర్ వన్ నుంచి మొదలుకుని నిన్నటి బాహుబలి వరకూ ఎక్కడ చూసినా ఒకదాన్ని మించి మరొకటి ఉంటుంది. రెండు దశబ్దాల క్రితం శాంతినివాసం సీరియల్ తో ఆకట్టుకున్న జక్కన్న,ఆతరువాత కె రాఘవేంద్రరావు పర్యవేక్షణలో రాటుదేలాడు. మొదటి సినిమా స్టూడెంట్ నెంబర్ వన్ తోనే విజయాన్ని సొంతం చేసుకుని చిత్ర పరిశ్రమలో అందరి దృష్టిని ఆకర్షించిన రాజమౌళి ఇప్పటివరకూ బాహుబలి కంక్లూజన్ తో కల్పి ఇప్పటిదాకా 11సినిమాలు మాత్రమే తీసాడు.

అంతేకాదు బాహుబలికి ముందు తర్వాత అన్నట్టుగా వాతావరణాన్ని మార్చేశాడు. స్టూడెంట్ నెంబర్ వన్ గా విద్యార్థిగా ప్రయాణం మొదలుపెట్టి, ఇప్పుడు బాహుబలితో ప్రొఫెసర్ స్థాయికి చేరాడని చెప్పవచ్చు.కేవలం 11మూవీస్ తోనే వరల్డ్ వైడ్ గా పేరుతెచ్చుకోవడం రాజమౌళికే సాధ్యమైంది. కేవలం నేర్చుకోవాలన్న తపన,క్రమశిక్షణ,పక్కా ప్రణాళిక ఈయన విజయాలకు కారణం. జక్కన్న అని సన్నిహితులు ముద్దుగా పిలుచుకుంటారు.

తెలుగు సినీ పరిశ్రమలో ఎడిటింగ్ చేసే కోటగిరి వెంకటేశ్వర రావు దగ్గర అసిస్టెంట్ వీడియో ఎడిటర్ గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన రాజమౌళి,అన్ని విభాగాల్లో నేర్చుకోవాలని,రాఘవేంద్రరావు దగ్గర అసిస్టెంట్ గా చేరాడు. అన్ని విషయాలను సులువుగా నేర్చుకునే ఓర్పు ఒడిసిపట్టుకుని,రాఘవేంద్రరావు పర్యవేక్షణలో శాంతినివాసం సీరియల్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేసాడు. స్టూడెంట్ నెంబర్ వన్ మూవీతో తన పనితనం నిరూపించుకున్న రాజమౌళి ఆతర్వాత సింహాంద్రి మూవీతో ఎన్టీఆర్ ని స్టార్ స్టేటస్ కి తీసుకెళ్లాడు.

ఇక ప్రభాస్ తో తీసిన ఛత్రపతి బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్ హిట్ కొట్టింది. అయితే ఇందులోని ఫైట్స్ క్వాలిటీగా లేవనే విమర్శలు రావడంతో ఏదో చేయాలనే కోరిక రాజమౌళితో రాజుకుంది. దీంతో గ్రాఫిక్స్ తో మంచి సినిమా చేయాలన్న ఆలోచన కలగడంతో ఎన్టీఆర్ తో యమదొంగను చేయించింది. ఆడియన్స్ కి ఈ మూవీ కొత్త అనుభూతి కల్గిస్తే, రాజమౌళికి కొండంత ఆత్మవిశ్వాసాన్ని నింపడంతో టాలీవుడ్ స్థాయిని మించేలా మగధీర తీయడానికి కారణమయింది.

ఇక హీరోయిజాన్ని వీరలెవెల్లో చూపించే రాజమౌళి ఆతర్వాత ఈగతో సినిమా తీసి,విమర్శకుల చేత ఔరా అనిపించారు. విజువల్ ఎఫక్ట్, గ్రాఫిక్స్ మీదా కూడా ఈ సినిమాతో మరింత పట్టు సాధించిన రాజమౌళి,ప్రపంచం మొత్తం తనవైపు తిప్పుకునేలా బాహుబలి తీసాడు. దటీజ్ రాజమౌళి అనిపించుకున్నాడు.