Movies

బిగ్ బి అమితాబ్ దగ్గర ఎన్ని లగ్జరీ కార్లు ఉన్నాయో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే !

ఎవరింట్లో అయినా ఒకటి రెండు కార్లు ఉండడం సహజం. సెలబ్రెటీలయితే మూడు నాలుగు ఉంటాయి. కానీ అందరిలా ఉంటే నా స్పెషాలిటీ ఏముంది అనుకున్నాడో ఏమో కానీ బిగ్ బీ అమితాబ్ ఏకంగా అత్యంత ఖరీదైన విదేశీ బ్రాండ్ కార్లు తన ఇంటి ఆవరణలో పార్క్ చేసేస్తున్నాడు. అమితాబ్ కి కార్ కలెక్షన్ అంటే చాలా ఇష్టం. అందుకే మార్కెట్లోకి వచ్చిన ఖరీదైన కారు మీద కన్ను పడిందా వెంటనే తన గుమ్మంలో ఉండాల్సిందే.

ఇలా ఇప్పటివరకు బిగ్ బీ దగ్గర మొత్తం 12 లగ్జరీ కార్లున్నాయి. బెంట్లే కాంటినెంట్ జీటీ, బెంట్లే ఆరెంజ్, రేంజ్ సేవర్ వోగ్, మినీ కూపర్ ఎస్, టయోటా ల్యాండ్ క్రూజర్, రోల్స్ రాయల్ మొదలైన వాహనాలున్నాయి. వీటి ఖరీదు కోట్లలోనే ఉంటుంది. కాగా ఈ వాహనాలకు సంబంధించిన నంబర్ ప్లేట్లపై 2 నంబరు తప్పనిసరిగా కనిపిస్తుంటుంది. అమితాబ్ పుట్టినరోజు నేడు (అక్టోబరు 11)ఈ సందర్భంగా మీడియాకి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో ఆ విషయం ఆయనే స్వయంగా చెప్పాడు.