నారా బ్రాహ్మణి కి అంత ధైర్యం ఎలా వచ్చిందో తెలుసా? నమ్మలేని నిజాలు
గొప్పింటి పిల్లలు, పెద్దింటి పిల్లలు అంటుంటాం. కరక్టే కానీ,ఏ ఇంటి బిడ్డ అయినా,ఆడ మగా తేడా లేకుండా స్వతంత్ర భావాలతో ఎదగనీయాలి. అది వ్యాపార రంగమైనా, రాజకీయరంగమైనా, మరో రంగమైనా సరే,స్త్రీ పురుష బేధం ఉండకూడదు. అప్పుడే వారు తనదైన ముద్ర వేస్తారు. ఇలా అంటున్నది ఎవరో కాదు నారా బ్రాహ్మణి. నటరత్న ఎన్టీఆర్ కి మనవరాలు, నందమూరి బాలకృష్ణ కు పెద్ద కూతురు, ముఖ్యమంత్రి చంద్రబాబు కి కోడలు, మంత్రి లోకేష్ కి భార్య అయిన ఈమె విదేశాల్లో ఎం బి ఏ చదువుకుని, బిజినెస్ రంగంలో దూసుకుపోతున్నారు. హెరిటేజ్ సంస్థకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా అద్వితీయంగా నిర్వహణ చేస్తూ,దేశం నలుమూలకు విస్తరిస్తూ, లాభాల పంట పండిస్తున్నారు.
ఈ మధ్య నారా బ్రాహ్మణి ఓ ఇంటర్యూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తన తల్లి వసుంధర పెద్దగా చదువుకోకపోయినా ఎన్నో విషయాల్లో అవగాహన మెండుగా ఉండడం గొప్ప విషయం. ఆమె స్వతంత్ర భావాలు పుష్కలంగా కలిగి ఉంటారు. ఆమె క్రమశిక్షణలో పెరిగాను. ఇక అత్తయ్య భువనేశ్వరి కూడా ఎంతో మనోనిబ్బరం,ఆత్మవిశ్వాసం గల మహిళ. అందుకే హెరిటేజ్ సంస్థను ఆమె జీరో స్థాయినుంచి 2వేల కోట్ల ఆదాయానికి తీసుకెళ్లగలిగారు.
ముంబయిలో పుట్టి,చెన్నైలో పెరిగిన బ్రాహ్మణి కి చిన్నప్పటి నుంచి లెక్కలంటే చాలా ఇష్టమట. ‘రోజుకి పది గంటలు కదలకుండా లెక్కలు చేసేదాన్ని. శ్రీ చైతన్యలో ఇంటర్ చదివేటప్పుడు స్టార్ బ్యాచ్ లో ఉండేదాన్ని. ఒక్క మార్కు తగ్గినా ఎం సెట్ లో సీటు గల్లంతు అవుతాయి. అందుకే మోడల్ పరీక్షల్లో కూడా విపరీతంగా పోటీ పడేదాన్ని. చదువు విషయంలో అమ్మ కఠువుగానే ఉండేది’అని నారా బ్రాహ్మణి వివరించింది.
ఇక సెలవలు వస్తే, కేంబ్రిడ్జ్ వంటి యూనివర్సిటీలు అందించే వేసవి శిబిరాల వివరాలు సేకరించి,మా అమ్మ నన్ను విదేశాలకు పంపేదని నారా బ్రాహ్మణి చెప్పుకొచ్చారు. ‘ఇంటర్ తర్వాత సీబీఐ టి చదువుతూ అమెరికా వెళ్లాను. అక్కడే డిగ్రీ పూర్తిచేసి,ఎం ఎస్ చేశాను. అన్నింటా టాప్ లో ఉండే నేను , ఎంబీఏ కోసం అప్లికేషన్స్ పెడితే, నాలుగు యూనివర్సిటీల నుంచి సీటు వచ్చేసింది. దీంతో నేను స్టాన్ ఫోర్నియా ఎంచుకున్నా. స్టడీస్ తో పాటు,మార్కెటింగ్,అగ్రి,ఫార్మా క్లబ్ లకు లీడర్స్ టీమ్ లో ఉండేదాన్ని.
అప్పుడే వెంచర్ కేపిటల్ రంగం వైపు దృష్టి మళ్లింది. కొత్త పరిశ్రమలను ప్రోత్సహిస్తూ,వారికి ఆర్ధిక సాయం అందించడమే ఓ వృత్తిగా మారడం ఆనందంగా ఉండేది. దీనికి సంబంధించిన అంశాలను తెలుసుకోడానికి సింగపూర్ వెళ్లి అక్కడ రెండేళ్ల పాటు పనిచేసాను. ఎన్నో విషయాలు తెలుసుకున్నా’అని నారా బ్రాహ్మణి వివరించారు.
ఇక సొంత బావ తో పెళ్లి అనేటప్పటికీ కొంత తడబడినా,కొంచెం సేపు మేమిద్దరం మాట్లాడుకుని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడంతో పెళ్ళాయిందని నారా బ్రాహ్మణి చెప్పారు. లోకేష్ కూడా మామగారిలా కష్టపడే తత్వమని అన్నారు. తాతగారు ఎన్టీఆర్ అంటే అందరికీ భయం ఉన్నా, మా చెల్లి తేజస్వికి అసలు భయం ఉండేది కాదని సోదాహరణంగా వివరించారు.
మాకు పుట్టిన దేవాన్ష్ తో గడపడం అంటే మామగారికి ఎంతో ఇష్టమని ఆమె చెబుతూ,ఓసారి ఆవు గురించి అడిగితె,ఆవు తెల్లగా ఉంటుందని మొదలుపెట్టి రాష్ట్రంలో ఎన్ని ఆవులున్నాయి ఎక్కడ ఎక్కువ ఉన్నాయి ఇలా అన్ని విషయాలు చెప్పేశారని నారా బ్రాహ్మణి నవ్వుతూ చెప్పుకొచ్చింది. స్వతంత్రంగా ఎదగాలంటే మహిళకు చదువు అవసరమని,అది ఉంటె ఏదైనా సాధించవచ్చని, అందుకు తానె ఉదాహరణ అని వివరించారు.