క్షమాభిక్షను భగత్ సింగ్ ఎలా తిరస్కరించాడో తెలుసా?
భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ఎందరో భాగస్వాములయ్యారు. కొందరు విప్లవ బాటను ఎంచుకుంటే,మరికొందరు అహింసా యుతంగా పోరాటం సాగించాలని నిర్ణయించుకున్నారు. ఎవరి బాటలో వాళ్ళు పోరాటం సాగించారు. హింసకు ప్రతిహింస మార్గమని నమ్మిన వాళ్లలో భగత్ సింగ్,సుఖ్ దేవ్,రాజ గురు తదితరులున్నారు. లాలా లజపతిరాయ్ ని హతమార్చిన పోలీసు అధికారిపై పగతీర్చుకోవాలని భగత్ సింగ్ తదితరులు భావించారు. ఈ హత్య ఘటనకు కారణమైన బ్రిటిష్ పోలీసు అధికారి స్కాట్ ని చంపాలని పధక రచన చేసారు.
అయితే వాళ్ళు జరిపిన దాడిలో స్కాట్ బదులు స్టాండర్డ్స్ అనే అధికారి మరణించాడు. దీంతో భగత్ సింగ్,సుఖ్ దేవ్,రాజగురు లపై బ్రిటిష్ ప్రభుత్వం అభియోగం మోపింది. అలాగే కేంద్ర శాసన సభ కార్యాలయంపై బాంబు విసిరిన ఘటనలో కూడా భగత్ సింగ్ తదితరులపై కేసులు నమోదయ్యాయి. జైల్లో కనీస సదుపాయాలు కల్పించకుండా చిత్ర హింసలకు గురిచేయడంతో భగత్ సింగ్ తదితరులు పోరాడారు. దీక్ష కూడా చేపట్టాడు. ఇక నమోదైన కేసులకు సంబంధించి ఉరిశిక్ష పడిపోయింది.
ఉరిశిక్ష నేపథ్యంలో భగత్ సింగ్ ఫ్రెండ్ ప్రణత్ మెహతా క్షమా భిక్ష ముసాయిదా లేఖ తెచ్చి భగత్ సింగ్ కి ఇచ్చాడు. అయితే దానిపై సంతకం చేయలేదు సరికదా ‘వ్యక్తులను చంపడం సులువే కావచ్చు కానీ సిద్ధాంతాలను హతమార్చలేరు. గొప్ప గొప్ప సామ్రాజ్యాలు కూలిపోయినా, సిద్ధాంతాలు సమాధి చేయలేరు. అవి సజీవంగా ఉంటాయి, ఉండబోతున్నాయి,ఉంటాయి కూడా. జీవితం అంటే భవిష్యత్తులో మోక్షం పొందడం కోసం ఏదో చేయడం కాదు. మనం ఏమి చేయాలన్న ఇప్పుడే చేసెయ్యాలి. ప్రజాస్వామ్య పురోగతి పైనే ఏదైనా ఆధారపడి ఉంటుంది’అని చెప్పుకొచ్చాడు.