Movies

డిస్కో శాంతి తండ్రి ఒకప్పటి టాప్ హీరో….చెల్లి హీరోయిన్ అనే విషయం మీకు తెలుసా?

అన్నీ అనుకున్నట్టు జరిగితే, అందరి జీవితాలు ఒకలాగే ఉంటె ఈ లోకం ఇలా ఎందుకుంటుంది అనే మాట వింటుంటాం. అందునా రంగుల ప్రపంచంలోని సినిమా వాళ్ళ జీవితాలు చూస్తే, ఏదో కొద్దిమంది జీవితాలు మినహా మిగిలిన చాలామంది జీవితాలు ఆగమ్య గోచరమే. ఇక అసలు విషయానికి వస్తే,తెలుగు సినిమాల్లో క్లబ్ డాన్స్ పాటలకు ఒకప్పుడు పెట్టింది పేరైన డిస్కోశాంతి మంచి డాన్సర్. ఏవో కొన్ని మంచి పాత్రలు చేసినా,ఎక్కువగా క్లబ్ పాటల్లో మెరిసింది. అయితే ఈమెను రియల్ హీరో శ్రీహరి పెళ్లి చేసుకున్న సంగతి తెల్సిందే. శ్రీహరి, డిస్కోశాంతి లకు ముగ్గురు పిల్లలు పుట్టగా, కూతురు చిన్న వయసులోనే కన్నుమూసింది. ఇక 2013లో శ్రీహరి గుండెపోటుతో కన్నుమూశాడు. దీంతో ఇద్దరు మగపిల్లలను పెంచుతూ డిస్కోశాంతి జీవనం సాగిస్తోంది.

ఇక డిస్కోశాంతి చెల్లెలు లలితా కుమారి కూడా మంచి నటే. 1987లో మనవిల్ ఉరుది వెందుల్ అనే తమిళ మూవీలో నటించి వెండితెరకు పరిచయం అయింది. సినిమాల్లో నటిస్తున్న సమయంలోనే నటుడు ప్రకాష్ రాజ్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లితో సినిమాలకు గుడ్ బై చెప్పిన ఈమెకు ముగ్గురు పిల్లలు పుట్టారు. ఇందులో ఇద్దరు ఆడపిల్లలు,ఒక కొడుకు.

అయితే నాలుగేళ్ల వయస్సులో కొడుకు మరణించడం,ఇక ప్రకాష్ రాజ్,లలితాకుమారి ల మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులు తీసేసుకున్నారు. ఆవిధంగా భర్త నుంచి దూరమై, ఇద్దరు ఆడపిల్లలను పెంచుకుంటూ జీవనం సాగిస్తోంది.డిస్కోశాంతి , లలితా కుమారి ల విషయంలో విధి ఇలా చేసింది. అయితే వీరి తండ్రి ఒకప్పటి స్టార్ హీరో అని చాలామందికి తెలీదు. తమిళ, మలయాళ, హిందీ భాషల్లో దాదాపు 60చిత్రాల్లో నటిస్తే, అందులో పాతిక చిత్రాల్లో హీరోగా వేసాడు.

ఆయన పేరు సి.ఎల్. ఆనందన్. హీరో అయినా, విలన్ అయినా, కేరక్టర్ నటుడైనా పాత్ర ఏదైనా సరే, అందులో జీవించి మెప్పించడంలో ఆయనకు ఆయనే సాటి అనిపించుకున్నారు. 1933జూన్ 15న పుట్టిన ఆనందన్,నటన మీద మక్కువతో 1952లో మలయాళంలో ఆచెన్ అనే సినిమాతో వెండితెర మీదకు వచ్చాడు.

1953లో’తందై’ అనే మూవీతో విలన్ గా తమిళ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. పలు చిత్రాల్లో తనదైన నటనతో మెప్పించిన ఈయన లక్ష్మి అనే మహిళను పెళ్లాడారు. వీరికి నలుగురు కుమారులు,ముగ్గురు కుమార్తెలు. 55ఏళ్ళ వయస్సులో అంటే 1989లో ఆనందన్ కామెర్ల వ్యాధితో మరణించారు. తండ్రి వారసత్వంతో డిస్కోశాంతి,లలితకుమారి సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. పెళ్లి తో ఇద్దరూ సినీ పరిశ్రమకు దూరం అయ్యారు.