చైల్డ్ ఆర్టిస్ట్ లు గా రాజమౌళి, శ్రీలేఖ….ఇంతకీ ఏ సినిమాయో తెలిస్తే షాకవుతారు
తానొకటి తలిస్తే దైవం ఒకటి తలచింది అంటారు కదా. సినిమా రంగంలో ఇది అతికినట్టు సరిపోతుంది. కొందరు ఏదో అవుదామని వచ్చి,మరేదో అవుతారు. ఇక బాల నటులుగా వచ్చి,పెద్దయ్యాక హీరోలుగా రాణిస్తున్నవాళ్లూ ఉన్నారు. చిన్నప్పుడు ఒకటి రెండు సినిమాల్లో నటించి కూడా పెద్దయ్యాక, సినిమాల్లో వేరే రంగాల్లో సెటిల్ అయ్యేవాళ్ళూ ఉన్నారు. ఇక అసలు విషయానికి వస్తే, ఎస్ ఎస్ రాజమౌళి పేరుచెబితే మనందరికీ వరల్డ్ వైడ్ గా తెలుగు చిత్రపరిశ్రమకు కీర్తి పతాక తెచ్చిన మోస్ట్ పాపులర్ డైరెక్టర్ అని తెలిసిపోతుంది. 2001లో స్టూడెంట్ నెంబర్ వన్ మూవీతో దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు పర్యవేక్షణలో డైరెక్టర్ గా తానేమిటో నిరూపించుకున్న రాజమౌళి, ఆతర్వాత సింహాద్రి మూవీ తీసి ఇంకో బ్లాక్ బస్టర్ అందించాడు.
ఇక ఎవరితో సినిమా తీసినా హిట్ కొడుతూ, బాహుబలి మూవీతో తెలుగు సినిమా రేంజ్ ని ఎక్కడికో తీసుకెళ్లిన ఘనత రాజమౌళిదే.
ఇక సంగీత దర్శకురాలిగా పేరొందిన ఎం ఎం శ్రీలేఖ ఎన్నో సినిమాలకు సంగీతం అందించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈమె మంచి సింగర్ కూడా. 12ఏళ్ళ ప్రాయంలోనే అంటే 1992లో ప్లే బ్యాక్ సింగర్ గా చిత్రసీమలోకి అడుగుపెట్టింది.
నాళై దీపు సినిమాతో తమిళంలోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె సింగర్ గా , మ్యూజిక్ కంపోజర్ గా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. హిందీ లో కూడా పలు సినిమాలకు పాటలకు బాణీలు కట్టారు. రాజమౌళి,శ్రీలేఖ అన్నాచెల్లెళ్లు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎం ఎం కీరవాణి కూడా వీరికి బ్రదరే. రాజమౌళితో మంచి నటుడు ఉన్నాడు. బాహుబలి ఐటెం సాంగ్ లో కల్లు విక్రయించే పాత్రలో తళుక్కున మెరిశాడు.
అయితే రాజమౌళి చిన్నప్పుడు ఓ వేషం వేసాడు. అదీ కృష్ణుని వేషం. అలాగే అదే మూవీలో శ్రీలేఖ భక్తురాలి పాత్ర వేసింది. ఇలా చిన్నప్పుడే అన్నా చెల్లెల్లు భగవంతుడు,భక్తులు వేషాలు వేశారు. స్వయంగా రాజమౌళి పెదనాన్న తీసిన ఈ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. అవును ఆర్ధిక ఇబ్బందుల వలన ముందుకు కదలలేదు. ఇంతకీ ఆ సినిమా పేరు పిల్లనగ్రోవి. ఆడియన్స్ ముందుకు రాని ఆ సినిమా కారణంగా రాజమౌళిని క్రేజీ డైరెక్టర్ గానూ,శ్రీలేఖను మ్యూజిక్ కంపోజర్,సింగర్ గా చూసేవాళ్ళం కాదేమో కదా.