రామానాయుడి కోడళ్ళు ఇద్దరు పెళ్ళికి ముందే సిస్టర్స్… వీరు ఎక్కువగా బయట కనపడరు ఎందుకు?
పద్మభూషణ్,దాదా సాహెబ్ ఫాల్కే అవార్డులు గెలుచుకున్న మూవీ మొగల్,స్టార్ ప్రొడ్యూసర్ డాక్టర్ దగ్గుబాటి రామానాయుడు అంటే తెలుగు ఇండస్ట్రీలోనే కాదు దేశంలోని అన్ని భాషల్లో పేరుంది. ఎందుకంటే అన్ని ప్రాంతీయ భాషల్లో కూడా చిత్రాలు తీసిన ఘనత ఈయనిది. ప్రొడ్యూసర్ గా గిన్నీస్ బుక్ లో ఎక్కిన రామానాయుడు హైదరాబాద్ లో రామనాయుడు స్టూడియోస్ కూడా కట్టారు. ఎందరో దర్శకులను, హీరోలను,హీరోయిన్స్ ని , కేరక్టర్ ఆర్టిస్టులను ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఘనత కూడా డాక్టర్ రామానాయుడుదే. తన దగ్గర పనిచేసే వర్కర్స్ యోగక్షేమాలు చూస్తూ, వారికీ సొంత ఇంటికల కూడా నెరవేర్చిన మంచి మనిషి అని పేరుంది.
ఇక డాక్టర్ రామానాయుడికి ఇద్దరు కుమారులు. ఒక కూతురు. పెద్ద కొడుకు సురేష్ తండ్రి బాటలో స్టార్ ప్రొడ్యూసర్ గా రాణిస్తుండగా, రెండో కొడుకు విక్టరీ వెంకటేష్ హీరోగా తనకంటూ ఓ క్రేజ్ తెచ్చుకున్నాడు. 1958లో రాజేశ్వరి అనే అమ్మాయిని పెళ్లిచేసుకున్న రామానాయుడు ఏనాడూ భార్యను సినీ ఫంక్షన్స్ కి తీసుకొచ్చేవారు కాదు. గుట్టుగా సంసారం చేసుకునే అలవాటు కారణంగా ఆమె ఎప్పుడూ బయటకు రాలేదు.
ఆమె ఒరవడి ఇంట్లో ఇప్పటికీ కోడళ్ళు పాటిస్తున్నారు. సురేష్ భార్య లక్ష్మి గానీ,వెంకటేష్ భార్య నీరజ గానీ ఏ ఫంక్షన్ లోనూ కనిపించలేదు. సురేష్ బాబుకి ఇద్దరు కొడుకులు రానా, అభిరామ్, ఒక కూతురు మాళవిక. వెంకటేష్ కి ముగ్గరూ కూతుళ్లే. తణుకుకు చెందిన వ్యాపార దిగ్గజం ఇలమర్తి నారాయణరావు చౌదరి కుమార్తె లక్ష్మి ని సురేష్ వివాహం చేసుకున్నాడు. పెళ్లయిన ఈ 30ఏళ్ళల్లో ఒక్కసారి కూడా ఆమె బయటకు కనిపించలేదు.
చౌదరికి లక్ష్మితో పాటు రాజా అనే కొడుకున్నాడు. అతడు ప్రముఖ పారిశ్రామిక వేత్త డాక్టర్ ముళ్ళపూడి హరిచంద్ర ప్రసాద్ అల్లుడు. ఇక వెంకటేష్ భార్య నీరాజుకు,సురేష్ భార్య లక్ష్మికి పెళ్ళికి ముందే చుట్టరికం ఉంది. సినిమా రంగానికి చెందిన అచ్చిబాబు భార్యకు వెంకటేష్ భార్య నీరజ స్వయానా చెల్లి. అలాగే అచ్చిబాబు కజిన్ కూతురే సురేష్ భార్య లక్ష్మి.
సో పెళ్ళికి ముందే లక్ష్మి,నీరజ లు అక్కాచెల్లెళ్ల వరసన్నమాట. ఎన్నడూ ఫామిలీ మెంబర్స్ బయటకు రాకుండా రామానాయుడు బాటలోనే సురేష్,వెంకటేష్ నడుస్తున్నప్పటికీ సురేష్ కొడుకు అభిరాం కారణంగా సోషల్ మీడియాలో చేస్తున్న పోస్టింగ్స్ ఇబ్బంది కలిగిస్తున్నాయని అంటున్నారు. సురేష్ కూడా ఈ విషయంలో బాధ పడ్డాడట.