Movies

టాలీవుడ్ లో టాప్ హీరోయిన్స్ గా ఉన్న వీరు తెలంగాణ అమ్మాయిలని మీకు తెలుసా?

ఉమ్మడి మద్రాస్ రాష్ట్రం నుంచి ఆంధ్ర ప్రదేశ్ విడిపోయిన చాలాకాలం తర్వాత హైదరాబాద్ కి తెలుగు చిత్రపరిశ్రమ తరలి వచ్చింది. బాగా ఇండస్ట్రీ నిలదొక్కుకుంది. అయితే నాలుగేళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణా విడిపోవడంతో చిత్ర పరిశ్రమలో కూడా తెలంగాణా ఇంపార్టెన్స్ పెరిగింది. అంతకుముందులేని ప్రాధాన్యత ఇప్పుడు కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. గతంలో అంతగా తెలంగాణ నుంచి సినిమాల్లోకి మహిళలు వచ్చేవారు కాదు. కానీ ఇప్పుడు బానే వస్తున్నారు. ఒకసారి లిస్టు పరిశీలిద్దాం. గాయత్రీ గుప్తాను మొదటగా ప్రస్తావిస్తే,ఫిదా సినిమాలో హీరోయిన్ సాయిపల్లవి ఫ్రెండ్ గా నటించి అదరగొట్టేసింది. నిజానికి టివి యాంకర్ గా కెరీర్ మొదలుపెట్టి పెళ్ళికి ముందు షార్ట్ ఫిలిం తో గుర్తింపు సంపాదించుకున్న ఈమె సంగారెడ్డి జిల్లా జోగిపేటకు చెందింది. ఐస్ క్రీమ్ టు , ఫిదా చిత్రాలతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఈమె తాజాగా నటించిన ‘మిఠాయి’మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.

ఇక తెలంగాణా నుంచి వెళ్లి నేషనల్ లెవెల్లో గుర్తింపు పొందిన హీరోయిన్ అదితి రావు హైదిరీ వనపర్తి ప్రాంతానికి చెందిన అమ్మాయి. నిజానికి వేలకోట్ల రూపాయల సంపదకు వారసురాలైన ఈమె నటనపై మోజుతో సినీ రంగంలో అడుగుపెట్టింది. మణిరత్నం మూవీ చెలియాతో టాలీవుడ్ లో తళుక్కుమన్న ఈమె సమ్మోహనం మూవీతో నేరుగా ఎంట్రీ ఇచ్చింది. మొదట్లో దక్షిణాదిన ఎంట్రీ ఇచ్చి ఆతర్వాత బాలీవుడ్ లో స్టార్ స్టేటస్ సొంతం చేసుకుంది.

హిందీలో ఆమె ‘ఢిల్లీ సిక్స్,మర్డర్3, ఫితూర్,పద్మావతి మూవీస్ బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. మరో తెలంగాణా అమ్మాయి అల్తి మియాకిల్ ఇతర భాషా పదాలను మిక్స్ చేసి తెలంగాణా యాసలో మాట్లాడే అమ్మాయిగా పేరుగాంచింది. అమీ తుమీ, అర్జున్ రెడ్డి మూవీస్ తో తనకంటూ ఇమేజ్ తెచ్చుకుంది. బిగ్ బాస్ తో పేరుతెచ్చుకున్న భాను కూడా తెలంగాణ అమ్మాయే. వరంగల్ కి చెందిన ఈ స్లిమ్ బ్యూటీ బిగ్ బాస్ తో విపరీతమైన క్రేజ్ సొంతంచేసుకుంది. అసలు సినిమాలపై మోజుతో ఇంటర్ లోనే గుడ్ బై చెప్పేసి హైదరాబాద్ వచ్చేసిన ఈమె ‘నీకు నాకు మధ్య ఈటింగ్’సినిమాతో వెండితెరమీద అందాలు ఆరబోసింది.

బాహుబలిలో తమన్నాకు డూప్ గా నటించడమే కాదు,ఆమె పక్కన ఫ్రెండ్ గా కొన్ని సీన్స్ లో నటించింది. ఇక తాజాగా వరుణ్ సందేశ్ పక్కన ఓ మూవీ చేస్తోంది. విషాదాంతంతో ముగిసిన ప్రత్యూష కూడా తెలంగాణ లో భువనగిరిలో జన్మించింది. అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించిన ఈమె స్నేహమంటే ఇదేరా, కలుసుకోవాలని,ఇదేం ఊరూరా బాబు వంటి చిత్రాలతో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

తిమిళం లో కూడా ఎదుగుతున్న సమయంలో తేజ డైరెక్షన్ లో ధైర్యం సినిమా కోసం ప్రత్యుషను తీసుకోవాలని ఫిక్స్ అయ్యారు. ఈలోగా ఆమె అనుమానాస్పద స్థితిలో మరణించి విషాదంలో ముంచింది. అసలు పవన్ కళ్యాణ్ సరసన తొలిప్రేమ చిత్రంలో హీరోయిన్ వేసి రాణించిన కీర్తిరెడ్డి మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. నిజామాబాద్ జిల్లాలో పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ గల కుటుంబం నుంచి వచ్చిన కీర్తిరెడ్డి తాత గంగారెడ్డి రాజకీయ నేత. గన్ షాట్ అనే మూవీతో ఎంట్రీ ఇచ్చిన కీర్తిరెడ్డి స్టార్ డమ్ తెచ్చుకుంది. అయితే అక్కినేని మనవడు హీరో సుమంత్ ని పెళ్లాడిన ఈమె కు కొన్నాళ్లకే విడాకులు అయ్యాయి.

దీంతో మరోవ్యక్తిని పెళ్లి చేసుకుని బెంగుళూరులో స్థిరపడింది. వరంగల్ కి చెందిన ఆనంది పేరు ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తోంది. ప్రియతమా నీవు అచట కుశలమా తో ఎంట్రీ ఇచ్చింది. సినిమా ఏవరేజ్ అయినా, ఆనంది నటన బాగా ఆకట్టుకుంది. ఈరోజుల్లో, బస్టాప్,గ్రీన్ సిగ్నల్ వంటి చిత్రాలతో కేరీర్ పెంచుకుంది. ప్రస్తుతం తమిళంలో ఈమెకు డిమాండ్ బానే ఉంది.

ఇక మగ హీరోల్లో నితిన్,విజయ్ దేవరకొండ కూడా తెలంగాణా వాళ్ళే. కాగా గతంలోకి వెళ్తే, విజయశాంతి కూడా తెలంగాణాయే. వరంగల్ జిల్లాకు చెందిన ఈమె ఎన్నో హిట్ చిత్రాల్లో నటించింది. ఇక కాంతారావు, ప్రభాకర రెడ్డి,సంగీత తదితరులు కూడా తెలంగాణా వాళ్ళే