గోవిందా గోవిందా సినిమాలో నటించిన ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఏమి చేస్తున్నాడో తెలుసా?
రంగుల ప్రపంచం సినీ పరిశ్రమలో ఎవరి పొజిషన్ ఎలా ఉంటుందో,ఎలా మారిపోతుందో చెప్పడం కష్టం. కొందరు ఏదో అవుదామని వచ్చి,మరేదో అవుతారు. ఇక బాల నటులుగా వచ్చి,పెద్దయ్యాక హీరోలుగా రాణిస్తున్నవాళ్లూ ఉన్నారు. చిన్నప్పుడు ఒకటి రెండు సినిమాల్లో నటించి కూడా పెద్దయ్యాక, సినిమాల్లో వేరే రంగాల్లో సెటిల్ అయ్యేవాళ్ళూ ఉన్నారు. స్టోరీ రైటర్ గా, దర్శకులుగా, రాణిస్తున్న వాళ్ళున్నారు. అలాగే వ్యాపార రంగంలో దిట్టాలుగా, పెద్ద పెద్ద ఉద్యోగులుగా స్థిరపడిన వాళ్ళూ ఉన్నారు. అందుకే ఎవరు ఎలా మారతారో చెప్పడం కష్టమే.
ఇక నాగార్జున శ్రీదేవి జంటగా రామ్ గోపాల వర్మ డైరెక్షన్ లో వచ్చిన గోవిందా గోవిందా మూవీలో చిన్న పిల్లోడు పాత్ర ధరించిన కుర్రాడు తన అసమాన నటనతో వారెవ్వా అనిపించాడు. అతని పేరు శ్రీ హర్ష మండా. ఆ మూవీలో అతడి నటన చూసిన వాళ్ళు ఇతను పెద్దయ్యాక మంచి నటుడు అవుతాడని చాలామంది అనుకున్నారు. కానీ అతడు నటన మీద కాకుండా డైరెక్షన్ పై దృష్టి పెట్టాడు. కులం,వరకట్నం వంటి వాటి గురించి వీడియోలు తీసి,ప్రజల్లో చైతన్యం నింపే కార్యక్రమం ద్వారా చాలామందికి పరిచయం అయ్యాడు.
పలు యూట్యూబ్ చిత్రాలను రూపొందించిన శ్రీ హర్ష ప్రస్తుతం షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ, పూర్తిస్థాయి సినిమాలు చేయాలని ప్రణాళిక వేస్తున్నాడు. బాల నటుడిగా పరిచయం అయిన ఆనంద్ వర్ధన్ ని హీరోగా పెట్టి శ్రీ హర్ష తీసిన సమాప్తం షార్ట్ ఫిలిం మంచి ఆదరణ చూరగొంది. ఇలాగే సినిమాలు కూడా తీసి తన స్టామినా చూపించాలని తహతహ లాడుతున్న శ్రీ హర్ష కోరిక నెరవేరాలని ఆశిద్దాం.