Movies

‘1 నేనొక్కడినే’ లో మహేష్ బాబు మదర్ ఒకప్పటి హీరోయిన్ అని తెలుసా? టాప్ హీరోయిన్ చెల్లి

క్యారెక్టర్ ఆర్టిస్టులను కూడా ఎప్పుడూ పాతమొఖాలే కాకుండా ఒక్కోసారి కొత్తముఖాలను పరిచయం చేయాలని చూసే, డైరెక్టర్లు,నిర్మాతలు చాలామందే ఉన్నారు. ఆ విధంగా వన్ నేనొక్కడినే మూవీలో సూపర్ స్టార్ మహేష్ బాబుకి మదర్ గా ఒకామె చేత నటింపజేశారు. అయితే ఆమె ఆషామాషీ వ్యక్తి కాదు. పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉంది. ఇంకా చెప్పాలంటే ఆమె ఒకప్పటి స్టార్ హీరోయిన్. అంతేకాదు వారికుటుంబం అంతా సినీ ఇండస్ట్రీ వారే కావడం విశేషం. ఇంతకీ వారెవరో తెలుసుకుందాం. ఆమె పేరు అను హాసన్. పేరుని బట్టి ఈమె బ్యాక్ గ్రౌండ్ కొంత తెల్సిపోవచ్చు అదేనండి కమల హాసన్ తాలూకాయే. ఈమె కమల్ కి కూతురు వరుస అవుతుంది. అంటే ఆమె కు సొంత బాబాయ్ అన్నమాట.

1970 జులై 15న పుట్టిన అను హాసన్ బిట్స్ పిలానీ నుంచి మానేజ్ మెంట్ కోర్సు పూర్తిచేసింది. ఈమె తండ్రి చంద్ర హాసన్, తల్లి గీతామణి. తన కుటుంబం అంతా సినీ రంగానికి చెందిన వారే కావడంతో ఈమె కూడా సినిమారంగంలో అడుగుపెట్టి, హీరోయిన్ గా వెండితెరపై మెరిసింది. ఇక ఆమె అక్క కూడా స్టార్ హీరోయిన్. ఆమె తెలుగులో కూడా సూపర్ హీరోయిన్ గా వెలుగొందింది. ఆమె సుహాసిని.

సుహాసిని డైరెక్షన్ చేసిన తమిళ మూవీ ఇందిరా సినిమాలో హీరోయిన్ గా తెరంగేట్రం చేసిన అను హాసన్ కి ఆ సినిమాతో మంచి గుర్తింపు వచ్చింది. ఈ సినిమాలో ఆమె సహజంగా చేసిన నటన చూస్తే, ఇదే ఆమెకు మొదటి సినిమా అని ఎవరూ అనుకోము. దీంతో తెలుగు, మలయాళం, తమిళ,కన్నడ, హిందీ భాషల్లో హీరోయిన్ గానే కాకుండా నటనకు ప్రాధ్యాన్యం గల సపోర్టింగ్ రోల్స్ లో కూడా రాణించింది.

సినిమాల్లోనే కాదు, తమిళ సీరియల్స్ లోనూ, రియాల్టీ షోలలోనూ,డబ్బింగు ఆర్టిస్టుగానూ ఇలా బహుముఖంగా తను రాంచింది. తమిళ ఛానల్ విజయ్ లో కాఫీ విత్ అను అనే సెలబ్రిటీ టాక్ షో లో హోస్ట్ గా చేసింది. ఈమె తమిళంలో ఇందిరా,ప్రియాంక, అలవందన్,రన్,నలదమయంతి సినిమాలు చేసి, నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఇక తెలుగులో వరుణ్ సందేశ్ నటించిన ఎవరైనా ఎప్పుడైనా సినిమాలో వదిన పాత్ర పోషించిన ఈమె, రామ్ హీరోగా వచ్చిన ఎందుకంటే ప్రేమంట సినిమాలో అత్త పాత్రలోనూ తెలుగులో వదినగా, అమ్మగా, అత్తగా, అక్కగా,పలు సినిమాల్లో చేసింది. వన్ నేనొక్కడినే మూవీలో మహేష్ బాబు అమ్మగా నటించి మెప్పించింది.